Olympic Swimmer: లూకాస్ మార్టెన్స్ ప్రపంచ రికార్డు
ABN , Publish Date - Apr 14 , 2025 | 03:34 AM
ఒలింపిక్ చాంపియన్ జర్మనీకి చెందిన లూకాస్ మార్టెన్స్ 400 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్‌లో ప్రపంచ రికార్డు సృష్టించాడు. 2009లో స్థాపించిన పాత రికార్డును 0.11 సెకన్ల తేడాతో అధిగమించాడు.

స్టాక్‌హోమ్: ఒలింపిక్ చాంపియన్ స్విమ్మర్ లూకాస్ మార్టెన్స్ (జర్మనీ) పురుషుల 400 మీ. ఫ్రీస్టయిల్‌లో వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. స్విస్ ఓపెన్‌లో భాగంగా శనివారం జరిగిన ఈ విభాగంలో 3:39.96 సెకన్ల టైమింగ్‌తో ప్రథమ స్థానంలో నిలిచాడు. దీంతో 2009లో సహచర జర్మన్ స్విమ్మర్ పాల్ బీడర్‌మన్ నెలకొల్పిన రికార్డును 0.11 సెకన్ల తేడాతో అధిగమించాడు. 23 ఏళ్ల మార్టెన్స్ పారిస్ ఒలింపిక్స్‌లోనూ 400మీ. ఫ్రీస్టయిల్‌లో స్వర్ణం అందుకున్నాడు.