పంత్‌కు రూ. 12 లక్షల జరిమానా
ABN , Publish Date - Apr 06 , 2025 | 04:51 AM
ముంబైతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించారు. లఖ్‌నవూ బౌలర్లు...

దిగ్వేష్ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత
లఖ్‌నవూ: ముంబైతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించారు. లఖ్‌నవూ బౌలర్లు నిర్ణీత సమయంలో పూర్తి చేయాల్సిన దానికంటే ఓ ఓవర్ వెనుకబడ్డారు. దీంతో ఆఖరి ఓవర్‌లో రింగ్ వెలుపల ఓ ఫీల్డర్‌ను తగ్గించాల్సి వచ్చింది. ఇదే తొలి తప్పిదం కావడంతో సారథి పంత్‌కు రూ. 12 లక్షలు జరిమానా విధించినట్టు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, లఖ్‌నవూ స్పిన్నర్ దిగ్వేష్ రాఠీ రెండోసారి ఐపీఎల్ క్రమశిక్షణ కోడ్‌ను ఉల్లంఘించడంతో అతడి మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించారు. నమన్ ఽధిర్ అవుటైన తర్వాత కూడా అతడు మరోసారి నోట్‌బుక్ సెలబ్రేషన్స్ చేసుకొన్నాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఫీజులో సగం కోతతోపాటు రెండు డీమెరిట్ పాయింట్లు అతడి ఖాతాలో చేరాయి.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..