Share News

సాత్విక్‌ జోడీ వచ్చేసింది!

ABN , Publish Date - Apr 16 , 2025 | 05:01 AM

సుదిర్మన్‌ కప్‌ ఫైనల్స్‌కు భారత బ్యాడ్మింటన్‌ జట్టును మంగళవారం ప్రకటించారు. మెగా టోర్నీ ఈనెల 27 నుంచి చైనాలోని గ్జియామెన్‌లో జరుగనుంది. పీవీ సింధు, లక్ష్య సేన్‌ సారథ్యంలో...

సాత్విక్‌ జోడీ వచ్చేసింది!

  • గాయత్రి జంట దూరం

  • ‘సుదిర్మన్‌’ ఫైనల్స్‌కు భారత జట్టు

న్యూఢిల్లీ: సుదిర్మన్‌ కప్‌ ఫైనల్స్‌కు భారత బ్యాడ్మింటన్‌ జట్టును మంగళవారం ప్రకటించారు. మెగా టోర్నీ ఈనెల 27 నుంచి చైనాలోని గ్జియామెన్‌లో జరుగనుంది. పీవీ సింధు, లక్ష్య సేన్‌ సారథ్యంలో మొత్తం 14 మందితో కూడిన భారత జట్టు ఈ పోటీల బరిలోకి దిగనుంది. మహిళల డబుల్స్‌లో ఏస్‌ జంట పుల్లెల గాయత్రి/ట్రీసా భుజం గాయం కారణంగా టోర్నీకి దూరమైంది. ఈ జోడీ గైర్హాజరుతో మహిళల డబుల్స్‌ బాధ్యతలను యువ జంట ప్రియ/శ్రుతి మోయనుంది. ఇక, గతనెల ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ సందర్భంగా వెన్నునొప్పికి గురైన పురుషుల డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌/చిరాగ్‌ శెట్టి మళ్లీ జట్టులోకి వచ్చేసింది. సాత్విక్‌ జంటకు బ్యాక్‌పగా హరిహరన్‌/రుబాన్‌ కుమార్‌ ద్వయాన్ని ఎంపిక చేశారు. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్‌తో పాటు వెటరన్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌, మహిళల సింగిల్స్‌లో సింధుతో పాటు అనుపమ, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ధ్రువ్‌ కపిల/తనీషా బరిలోకి దిగనున్నారు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 16 , 2025 | 05:01 AM