గెలుపే లక్ష్యంగా..
ABN , Publish Date - Apr 06 , 2025 | 05:04 AM
హ్యాట్రిక్ ఓటములతో డీలా పడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆదివారం సొంత మైదానంలో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అటు వరుసగా రెండు విజయాలతో జోరు మీదున్న గుజరాత్ టైటాన్స్ జట్టు...

ఐపీఎల్‌లో నేడు
సన్‌రైజర్స్ X గుజరాత్
వేదిక : హైదరాబాద్, రా.7.30
నేడు టైటాన్స్‌తో హైదరాబాద్ పోరు
హైదరాబాద్: హ్యాట్రిక్ ఓటములతో డీలా పడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆదివారం సొంత మైదానంలో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అటు వరుసగా రెండు విజయాలతో జోరు మీదున్న గుజరాత్ టైటాన్స్ జట్టు కమిన్స్ సేనకు సవాల్ విసరనుంది. బలంగా భావించిన బ్యాటింగ్ ఆర్డర్ వైఫల్యంతోనే రైజర్స్ తన మ్యాచ్‌లను ఓడుతూ వస్తోంది. ఆరంభ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన వీరంతా ఆ తర్వాత ప్రత్యర్థి జట్ల బౌలర్లకు దాసోహమయ్యారు. దీంతో జట్టు వరుసగా 190, 163, 120 స్కోర్లకే పరిమితమై, పట్టికలోనూ అట్టడుగున కొనసాగుతోంది. జట్టులో క్లాసెన్ మాత్రమే నిలకడగా రాణిస్తున్నాడు. 300 స్కోరు కోసం కాకుండా హెడ్, అభిషేక్, ఇషాన్, నితీశ్ జట్టును గెలిపించే ఇన్నింగ్స్ ఆడాలి. అటు బౌలింగ్‌లోనూ యువ స్పిన్నర్ జీషన్ అన్సారీ ఒక్కడే ఆశాకిరణంలా మారాడు. పేసర్లు కమిన్స్, షమి సహా మిగతా బౌలర్లంతా పరుగులిచ్చుకుంటున్నారు. టైటాన్స్ తొలి మ్యాచ్‌లో ఓడినా ఆ తర్వాత రెండు విజయాలతో నిలిచింది. ఓపెనర్ సాయిసుదర్శన్, గిల్, బట్లర్, రూథర్‌ఫోర్డ్, మిల్లర్, తెవాటియాలతో బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. పేసర్ రబాడ స్వదేశానికి వెళ్లడంతో అతడిస్థానంలో ఫిలిప్స్, కొట్జీలలో ఒకరిని ఆడించే చాన్సుంది.
పాయింట్ల పట్టిక
జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే
ఢిల్లీ 3 3 0 0 6 1.257
బెంగళూరు 3 2 1 0 4 1.149
గుజరాత్ 3 2 1 0 4 0.807
పంజాబ్ 3 2 1 0 4 0.074
కోల్‌కతా 4 2 2 0 4 0.070
లఖ్‌నవూ 4 2 2 0 4 0.048
రాజస్థాన్ 4 2 2 0 4 -0.185
ముంబై 4 1 3 0 2 0.108
చెన్నై 4 1 3 0 2 -0.891
హైదరాబాద్ 4 1 3 0 2 -1.612
గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;
ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్ రన్‌రేట్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..