Cricket: హైదరాబాద్‌లో 5G సేవలతో IPL ఉత్సాహం..
ABN , Publish Date - Apr 13 , 2025 | 12:01 AM
T20 క్రికెట్ జోష్ దేశవ్యాప్తంగా ఉప్పొంగుతున్న సమయంలో, హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో Vi (వొడాఫోన్ ఐడియా) తన 5G సేవలను ప్రారంభించింది.

హైదరాబాద్: T20 క్రికెట్ జోష్ దేశవ్యాప్తంగా ఉప్పొంగుతున్న సమయంలో, హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో Vi (వొడాఫోన్ ఐడియా) తన 5G సేవలను ప్రారంభించింది. అభిమానులు మ్యాచ్‌ల సంరంభాన్ని ఆస్వాదిస్తూ అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీని అనుభవించేందుకు Vi నెట్‌వర్క్ సౌకర్యాలను బలపరిచినట్లు తెలిపింది. స్టేడియంలో గుమిగూడే వేలాది ప్రేక్షకులకు సజావుగా 5G సేవలు అందించేందుకు అదనపు నెట్‌వర్క్ సైట్‌లను ఏర్పాటు చేసి, BTS, మాసివ్ MIMO సాంకేతికతలతో సామర్థ్యాన్ని పెంచినట్లు వివరించింది.
ఎవరికంటే..?
5G సామర్థ్యం ఉన్న హ్యాండ్‌సెట్‌లు కలిగిన Vi కస్టమర్లు, మొబైల్ సెట్టింగ్స్‌లో 5G ఆప్షన్‌ను సక్రియం చేయడం ద్వారా స్టేడియంలో అత్యాధునిక కనెక్టివిటీని ఆస్వాదించవచ్చు. ఈ సేవలు అభిమానులు ప్రత్యక్ష స్ట్రీమింగ్, రీల్స్ అప్‌లోడ్, స్నేహితులతో అనుసంధానంలో ఉండేందుకు ఉత్తమ అనుభవాన్ని అందిస్తాయి. Vi దేశంలోని 11 ప్రముఖ స్టేడియంలలో 5G సేవలను విస్తరించింది, వీటిలో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం, బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం, చెన్నైలోని ఎం.ఎ. చిదంబరం స్టేడియం, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం, జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్ స్టేడియం, లక్నోలోని ఎకానా స్టేడియం, ముంబైలోని వాంఖడే స్టేడియం, విశాఖపట్నంలోని డాక్టర్ వై.ఎస్.ఆర్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియం, చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ స్టేడియం ఉన్నాయి.
‘రంగోన్ కా ఖేల్ 2.0’ ప్రచారం ప్రారంభం..
మరోవైపు, IPL 2025 సీజన్‌ను ఘనంగా జరుపుకునేందుకు JSW పెయింట్స్ ‘రంగోన్ కా ఖేల్ 2.0’ ప్రచారాన్ని ముంబైలో ప్రారంభించింది. గత ప్రచారం విజయాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు, సమాజ స్ఫూర్తి, క్రికెట్ దిగ్గజాల సమ్మేళనంతో అభిమానులకు సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ ప్రచారం ద్వారా క్రికెట్ భావోద్వేగాల సమ్మేళనంగా మారిందని కంపెనీ జాయింట్ ఎండీ, సీఈవో సుందరేశన్ పేర్కొన్నారు.