Share News

Mars Mystery: మార్స్‌పై బయటపడ్డ వింత ఆకారం.. అది ఏలియన్స్‌దేనా..

ABN , Publish Date - Apr 07 , 2025 | 08:40 AM

Mars Mystery: కొన్నేళ్ల క్రితం నాసా మార్స్ రీకొనైసెన్స్ ఆర్బిట్ అనే స్పేస్ క్రాఫ్ట్‌ను మార్స్‌పైకి పంపింది. అది కీ హోల్‌ను పోలి ఉన్న ఆకారాన్ని ఫొటో తీసింది. ఆ ఆకారం భూమిపై ఉండే ఓ పురాతన కట్టడాన్ని పోలి ఉండటంతో రచ్చ మొదలైంది. ఏలియన్స్ ఉన్నాయన్న ప్రచారం జరిగింది.

Mars Mystery: మార్స్‌పై బయటపడ్డ వింత ఆకారం.. అది ఏలియన్స్‌దేనా..
Mars Mystery

భూమిపై జీవం మొదలైన నాటినుంచి ఇప్పటి వరకు ఏలియన్స్ ఉనికి అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. 2025వ సంవత్సరంలో కూడా ఏలియన్స్ ఉన్నాయన్న దానికి సరైన ఆధారాలు దొరకలేదు. సైన్స్ కూడా ఏలియన్స్ ఉన్నాయన్న వాదనను కొట్టిపడేస్తోంది. ఈ అనంత విశ్వంలో మనుషులు తప్ప.. మనుషుల్ని పోలిన ఆకారంతో ఎవరూ లేరని అంటోంది. కానీ, ఏలియన్స్ ఉన్నాయని నమ్మేవారు.. వాటి గురించి పరిశోధనలు చేస్తున్నవారు చాలా మందే ఉన్నారు. మార్స్‌పై ఏలియన్స్ ఉనికి ఉందన్న చర్చ చాలా ఏళ్లనుంచి జరుగుతోంది. అక్కడ చాలా రకాల మిస్టరీ ఆకారాలు సైతం బయటపడ్డాయి. వాటిలో చాలా వరకు భూమిపై ఉండే కొన్ని ఆకారాలను పోలి ఉండటంతో ప్రపంచ వ్యాప్తంగా చర్చ మొదలైంది.


2011 సంవత్సరంలో నాసా..మార్స్ రీకొనైసెన్స్ ఆర్బిట్ అనే స్పేస్ క్రాఫ్ట్‌ను మార్స్‌పైకి పంపింది. మార్స్‌లో ఓ చోట ఓ వింత ఆకారాన్ని ఫొటో తీసింది. అది అచ్చం కీ హోల్‌ను పోలి ఉంది. ఆ ఆకారంతో భూమిపై ఓ కట్టడం ఉంది. జపాన్‌లో కోఫున్ సమాధి అచ్చం కీ హోల్ ఆకారంలోనే ఉంటుంది. దీంతో రచ్చ మొదలైంది. మార్స్‌పై ఏలియన్స్ ఉన్నాయని, అది వాటి తాలూకా గుర్తులేనంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. హాస్ అనే పుస్తక రచయిత మార్స్‌పై బయటపడ్డ కీ హోల్ ఆకారంపై అనాలసిస్ చేశారు. అది సహజ సిద్ధంగా ఏర్పడింది కాదని, ఎంతో పగడ్భందీగా నిర్మించారని అన్నారు. మానవనిర్మితాలకు.. సహజ సిద్ధంగా ఏర్పడిన వాటికి తేడా ఉంటుందని చెప్పారు. కీ హోల్ ఆకారంపై ఆయన చేసిన అనాలసిస్‘ జర్నల్ ఆఫ్ స్పేస్ ఎక్స్‌ఫ్లోరేషన్‌’లో కూడా ప్రచురితం అయింది.


అయితే, సైంటిస్టులు మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపడేశారు. సైకాలజిస్టులు కూడా అదంతా ఒట్టి భ్రమేనని అంటున్నారు. అది మెదడు చేసే మ్యాజిక్ కారణంగా జరుగుతుందని చెబుతున్నారు. దీనిపై యూనివర్శిటీ ఆఫ్ లింకన్‌కు చెందిన సైకాలజిస్టు రాబిన్ క్రామర్ మాట్లాడుతూ.. ‘ మార్స్‌పై వింత ఆకారాలు కనిపించటం అన్నది ఓ భ్రమ. దాన్నే పారెడోలియా అంటారు. అది మెదడు చేసే పొరపాటు వల్ల జరుగుతుంది. కొన్ని సార్లు ముఖాలను కనిపెట్టే వ్యవస్థ సరిగా పని చేయదు. అందు కారణంగానే వింత వింత ఆకారాలు కనిపిస్తాయి. మీరు ఏదైనా వస్తువును కాల్చారు అనుకోండి.. అందులో మీకు వింత వింత ఆకారాలు కనిపిస్తాయి. అందులో మనుషుల ముఖాలను పోలిన ఆకారాలు కూడా ఉండొచ్చు’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి:

YouTube: యూట్యూబ్ నుంచి క్రేజీ ఫీచర్..ఇకపై షార్ట్స్ క్రియోషన్ మరింత ఈజీ

Deputy CM: విశాఖ గిరిజన గ్రామాల్లో పవన్ కల్యాణ్ పర్యటన..

Updated Date - Apr 07 , 2025 | 09:10 AM