Share News

Palm Payment System: యూపీఐని మించిన టెక్నాలజీ.. చైనా రూటే సపరేటు

ABN , Publish Date - Apr 14 , 2025 | 07:24 PM

యూపీఐకి మించిన టెక్నాలజీతో చైనాలో ప్రవేశపెట్టిన చెల్లింపుల వ్యవస్థ ప్రస్తుతం సంచలనంగా మారింది. హస్తరేఖలు, అరచేయిలోని రక్తనాళాల నెట్వర్క్ ఆధారంగా వ్యక్తులను గుర్తించి చెల్లింపులకు అనుమతించే ఈ వ్యవస్థను చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు.

Palm Payment System: యూపీఐని మించిన టెక్నాలజీ.. చైనా రూటే సపరేటు
China Palm Payment System

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా దేశాల్లో అత్యాధునిక టెక్నాలజీకి జపాన్ పర్యాయపదంగా ఉండేది. గత దశాబ్ద కాలంలో సృజనాత్మకలో జపాన్‌ను మించిపోయింది చైనా. కొత్త కొత్త ఇంజినీరింగ్, ఐటీ టెక్నాలజీతో ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. నగదు రహిత డిజిటల్ చెల్లింపుల్లోనూ చైనా ముందు వరుసలోనే ఉంది. భారత్‌లో డిజిటల్ చెల్లింపులకు పర్యాపదంగా మారిన యూపీఐకి మించిన సాంకేతికతో చైనా మరోసారి ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

అరిచేయి స్కాన్ చేసి చెల్లింపులు

ప్రస్తుతం భారత్ సహా ఏదేశంలో డిజిటల్ చెల్లింపులు జరపాలాన్నా స్మార్ట్ ఫోన్, క్రెడిట్ డెబిట్ కార్డుల వంటివి తప్పనిసరి. కానీ చైనా మాత్రం కేవలం అరచేయి చూపించి చెల్లింపులు జరిపేలా ఓ కొత్త సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. రెండేళ్ల క్రితమే అందుబాటులోకి వచ్చిన ఈ టెక్నాలజీ రానురాను చైనా అంతటా వ్యాపిస్తోంది. ఈ టెక్నాలజీతో చెల్లింపులు ఎంత సులువో చెబుతూ ఓ వ్లాగర్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది.


చైనా సంస్థ టెన్సెంట్ రూపొందించిన వీచాట్ ఓ సూపర్ యాప్. మెసేజింగ్, వాయిస్ వీడియో కాల్స్‌‌తో పాటు సోషల్ మీడియా, చెల్లింపులు సహా అన్ని సదుపాయాలు దీంట్లో అందుబాటులో ఉంటాయి. వివిధ సేవలు అందించే థర్డ్ పార్టీ యాప్స్‌ను కూడా వీచాట్‌లో సమ్మిళితం చేశారు. ప్రభుత్వ సేవలు, డాక్టర్ల అపాయింట్స్‌ కూడా ఇందులో బుక్ చేసుకోవచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. రోజువారి పనులకు కావాల్సినవన్నీ ఇందులో అందుబాటులో ఉంటాయి. ఈ యాప్‌లో అకౌంట్ ఉన్న వారికి వీ చాట్ పే ఐడి ఉంటుంది. అరచేతిలోని బయోమెట్రిక్ వివరాలను ఆయా వ్యక్తుల వీచాట్ పేఐడీ అకౌంట్లకు లింక్ చేస్తారు. అరచేయిలోని హస్తరేఖలు, చేయిలోపలున్న రక్తనాళాల అల్లిక ద్వారా వ్యక్తులను గుర్తిస్తారు. ఓ స్కానర్ వద్ద చేయి చూపించగానే డబ్బు చెల్లింపు జరిగిపోతుంది. 2023లో ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టారు. ఇదంతా వీడియోలో చూపించిన వ్యక్తి ఈ వ్యవస్థ నిజంగా అద్భుతమంటూ పొగిడారు. ఈ వీడియో నెట్టింట పెను సంచలనానికే దారి తీసింది.


ఇక వీడియోపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. భారత్‌ను తక్కువ అంచనా వేయనక్కర్లేదని అనేక మంది కామెంట్ చేశారు. భారత్‌లో యూపీఐ సాయంతో రూ.1 మొదలు లక్షల మేర చెల్లింపులు సునాయాసంగా జరిగిపోతున్నాయని అన్నారు. ఆన్‌లైన్ ఎకోసిస్టమ్ రూపకల్పనలో భారత్ ఇతర అనేక దేశాలకంటే ఎంతో ముందుందని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

జపాన్‌లో మరో అద్భుతం.. ఆరు గంటల వ్యవధిలో రైల్వే స్టేషన్ నిర్మాణం

చైనా అద్భుతం.. స్వతంత్రంగా పనిచేసే ఏఐ ఏజెంట్ సృష్టి

రష్యా ఘనత.. నెల రోజుల్లో అంగారకుడిని చేరే రాకెట్

Read Latest and Technology News

Updated Date - Apr 14 , 2025 | 07:36 PM