Paid Service: యూజర్లకు షాక్..ఇకపై ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఉపయోగిస్తే చెల్లించాల్సిందే..
ABN, Publish Date - Mar 31 , 2025 | 06:41 PM
ప్రముఖ సోషల్ మీడియా సంస్థ మెటా యూజర్లకు షాకిచ్చే వార్త చెప్పింది. ఇకపై ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఉపయోగిస్తే నెలవారీగా రుసం చెల్లించాలని తెలిపింది. అయితే ఈ విధానం ఎక్కడ అమలు చేస్తున్నారు. ఎవరికి చేస్తున్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం మనం వాడే సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ చాలా పాపులర్. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వీటిని ఉపయోగిస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ ప్లాట్‌ఫాంల వినియోగదారులకు షాక్ ఇచ్చే వార్త వచ్చేసింది. అది ఏంటంటే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వాడేవారు ఇప్పుడు నెలవారీగా కొత్త రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే మీరు ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలను ప్రకటనలతో ఉపయోగిస్తే ఎలాంటి ఛార్జీలు ఉండవు. కానీ ప్రకటన రహితంగా ఉపయోగించాలని భావిస్తే మాత్రం రుసుము పే చేయాల్సిందే. మెటా ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఇది పలు రకాల చర్చలకు దారి తీసింది.
మెటా తీసుకున్న నిర్ణయం
మొత్తం మీద ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు కొత్త రుసుము విధానం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మెటా, యూరోపియన్ యూనియన్‌లోని వినియోగదారుల నుంచి ప్రతి నెలా $14 (భారతీయ రూపాయిలలో దాదాపు రూ.1,190) వరకు వసూలు చేయాలని యోచిస్తోంది. ఈ కొత్త రుసుము ప్రకటనలు అవసరం లేదని కోరుకున్న వారి నుంచి వసూలు చేస్తారు.
ఈ మార్పు ప్రకారం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ను ప్రకటనలతో వాడుకోవచ్చు, కానీ ప్రకటనల లేని విధానం కావాలంటే చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు రెండు ప్లాట్‌ఫాంలను కూడా ప్రకటనలతో లేకుండా ఉపయోగించాలని అనుకుంటే, ఈ మొత్తాన్ని మరింత పెంచి $17 (భారతీయం: రూ.1,445) వరకు ఉంటుంది. అయితే, ఈ సబ్‌స్క్రిప్షన్ ఎంపిక డెస్క్‌టాప్ వినియోగదారుల కోసం మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.
టెక్ కంపెనీలపై పెరుగుతున్న ఒత్తిడి
ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం EU (యూరోపియన్ యూనియన్) తీసుకున్న నియంత్రణలు, ఆదేశాలు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా, EU టెక్ కంపెనీలపై పెద్ద ఒత్తిడి పెంచింది. ముఖ్యంగా, వ్యక్తిగతీకరించిన ప్రకటనలతో తీసుకునే వాణిజ్య నైతికతపై ప్రశ్నలు వేయడం, వినియోగదారుల వ్యక్తిగత డేటాను సురక్షితంగా ఉంచే విధానం వంటి అంశాలపై EU స్ట్రిక్ట్‌గా వ్యవహరించింది. తద్వారా, ఈ కొత్త విధానానికి సంబంధించి, EU నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా మెటా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇండియాలో కూడా అమలు చేస్తారా..
ఈ కొత్త విధానం ద్వారా ప్రకటనలను వినియోగదారులకు చూపించే ముందు, వారి అంగీకారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే వారికి ప్రకటనలు కనిపించనున్నాయి. సాధారణంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటివి "ఫ్రీ టు యూజ్" మోడల్‌తో పనిచేస్తున్నప్పటికీ, ఇప్పుడు ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ద్వారా టెక్ కంపెనీలు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇది చూస్తుంటే, టెక్ కంపెనీలు ఇకపై తమ ఆదాయాన్ని ప్రకటనల ద్వారా మాత్రమే కాకుండా, సబ్‌స్క్రిప్షన్ రూపంలో కూడా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విధానాన్ని భారత్ సహా ఇతర ప్రాంతాల్లో కూడా అమలు చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
iPhone 17: టెక్ ప్రియులకు అలర్ట్..ఐఫోన్ కొత్త మోడల్ లాంచ్ డేట్, ఫీచర్స్ లీక్
Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..
New Tax Rules: ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకుంటే మీకే లాభం..
Income Tax Changes: ఏప్రిల్ 1 నుంచి వచ్చే కొత్త పన్ను రేట్లు తెలుసుకోండి..మనీ సేవ్ చేసుకోండి..
Railway Jobs: రైల్వేలో 9,970 పోస్టులకు నోటిఫికేషన్..అప్లై చేశారా లేదా..
Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్
Read More Business News and Latest Telugu News
Updated Date - Mar 31 , 2025 | 06:41 PM