Share News

చరిత్రలో నిలిచిపోయే పథకం

ABN , Publish Date - Apr 01 , 2025 | 11:14 PM

రా ష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం పంపి ణీ కార్యక్రమం చరిత్రలో నిలిచి పోతుందని డీసీసీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. పా త మంచిర్యాల 8వ వార్డులో సన్న బియ్యం పథకా న్ని వారు ప్రారంభించారు.

చరిత్రలో నిలిచిపోయే పథకం
సన్న బియ్యం పథకాన్ని ప్రారం భిస్తున్న జిల్లా డీసీసీ అధ్యక్షురాలు సురేఖ

డీసీసీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ

లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ

మంచిర్యాల క్రైం, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): రా ష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం పంపి ణీ కార్యక్రమం చరిత్రలో నిలిచి పోతుందని డీసీసీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. పా త మంచిర్యాల 8వ వార్డులో సన్న బియ్యం పథకా న్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబం ఇంటింటికి సన్న బియ్యం పథకాన్ని ముఖ్య మంత్రి ప్రారంభించారన్నారు. పేద వారికి పట్టెడన్నం పె ట్టాలన్న ఆలోచనతో ఈ పథకాన్ని ప్రారంభించారన్నారు. గత ప్రభుత్వాలు పంచిన దొడ్డు బియ్యాన్ని తినలేక అమ్ముకున్న సందర్భాలు ఉన్నాయన్నారు. పాత మంచిర్యాలకు ఆరులైన్ల రహదారులను ఏర్పా టు చేస్తున్నారని, ముల్కల్ల నుంచి అంతర్గాం వర కు గోదావరిపై బ్రిడ్జి నిర్మాణాన్ని చేపడతామన్నారు. అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే జిల్లాలో అ భివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. ఈ కార్య క్రమంలో పట్టణ అధ్యక్షుడు తూముల నరేశ్‌, నా యకులు భానేష్‌, పూదరి తిరుపతి పాల్గొన్నారు.

అర్హులందరికీ సన్న బియ్యం

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

నస్పూర్‌ : ప్రభుత్వం చేపట్టిన సన్న బియ్యం ప థకం ద్వారా ప్రతి ఒక్క లబ్దిదారుడికి సన్న బి య్యం అందిస్తామని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నా రు. నస్పూర్‌ అంబేద్కర్‌ కాలనీ, అల్లూరి సీతారామ రాజు నగర్‌లో మంగళవారం రేషన్‌ షాపుల వద్ద సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా పౌర స రఫరా శాఖ అధికారి బ్రహ్మరావుతో కలిసి పరిశీ లించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పేదలకు కడుపు నిండా అన్నం పెట్టాలన్నా లక్ష్యం తో సన్న బియ్యం పథకాన్ని అమలు చేసిందన్నారు. సన్నబియ్యం పథకాన్ని జిల్లాలో సమర్థవంతంగా అ మలు చేస్తామన్నారు. అధికార యంత్రాంగం స మన్వయంతో అబ్దిదారులందరికి సన్న బియ్యం చేరే విధంగా కృషి చేయాలని కలెక్టర్‌ సూచించారు. ఈ కార్యక్రమాల్లో చౌకధరల దుకాణాల నిర్వహకులు, సంబందిత శాఖ అధికారులు పాల్గొన్నారు.

ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలి

మంచిర్యాల కలెక్టరేట్‌: ప్రభుత్వం పంపిణీ చేసే సన్న బియ్యాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నాయకురాలు హేమ లత, మినాజ్‌, రేషన్‌ డీలర్లు అన్నారు. మంగళవా రం సన్నబియ్యం పథకాన్ని జిల్లా కేంద్రాల్లోని పలు రేషన్‌ షాపుల్లో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రేషన్‌ డీలర్‌ ధర్మేందర్‌, నాయకులు సత్తార్‌, చారి, రాజేందర్‌, పాల్గొన్నారు.

Updated Date - Apr 01 , 2025 | 11:14 PM