ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

HMDA: ఉన్నతాధికారులు చెప్పినట్టు చేశా !

ABN, Publish Date - Jan 11 , 2025 | 02:53 AM

ఫార్ములా-ఈ కారు రేసు కేసుకు సంబంధించి హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి శుక్రవారం ఏసీబీ విచారణకు హాజరయ్యారు. సుమారు ఆరున్నర గంటల పాటు సాగిన విచారణలో ఏసీబీ అధికారులు ఆయన్ను వివిధ అంశాలపై ప్రశ్నించారు.

  • ఏసీబీ ఎదుట హెచ్‌ఎండీఏ మాజీ సీఈ బీఎల్‌ఎన్‌రెడ్డి

  • ఫార్ములా-ఈ కేసులో ఆరున్నర గంటల పాటు విచారణ

హైదరాబాద్‌, జనవరి 10(ఆంధ్రజ్యోతి): ఫార్ములా-ఈ కారు రేసు కేసుకు సంబంధించి హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి శుక్రవారం ఏసీబీ విచారణకు హాజరయ్యారు. సుమారు ఆరున్నర గంటల పాటు సాగిన విచారణలో ఏసీబీ అధికారులు ఆయన్ను వివిధ అంశాలపై ప్రశ్నించారు. హెచ్‌ఎండీఏ నుంచి విదేశీ కంపెనీ అయిన ఎఫ్‌ఈఓకు రెండు ఇన్వాయి్‌సలకు గాను రూ.45,71,60,625 ఎందుకు చెల్లించారు? ఆ సమయంలో పన్ను మినహయింపు ఇవ్వడం వల్ల రూ.8,06,75,404అదనపు భారం పడినప్పటికీ ప్రొసీడింగ్‌ ఆర్డర్‌ ఎందుకు ఇచ్చారు? ఎఫ్‌ఈఓకు బ్రిటన్‌ పౌండ్ల రూపంలో డబ్బు చెల్లించడానికి మీకు అధికారం ఉందా? ఫెడరేషన్‌ ఆఫ్‌ మోటార్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌కు రూ.1,10,51,014 ఎందుకు చెల్లించారు ? మీ వల్ల హెచ్‌ఎండీఏ జనరల్‌ ఖాతాలో రూ.54,88,87,043 దుర్వినియోగం అయ్యాయి కదా? హెచ్‌ఎండీఏ నిధుల నుంచి రూ.10కోట్లు కన్నా ఎక్కువ చెల్లించాల్సి వస్తే ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి కదా.. నిబంధనలు ఎందుకు ఉల్లంఘించారు? సీనియర్‌ అధికారి అయిన మీకు నిబంధనలు తెలియవా? అంటూ ఏసీబీ అధికారులు బీఎల్‌ఎన్‌ రెడ్డిని ప్రశ్నించినట్టు తెలిసింది.


అయితే, తాను ప్రొసీడింగ్‌ ఆర్డర్‌ ఇవ్వాలంటే తన ఉన్నతాధికారి, హెచ్‌ఎండీఏ చైర్మన్‌ అనుమతి కావాలని.. చైర్మన్‌ అనుమతించినందునే ప్రొసీడింగ్‌ ఆర్డర్‌ ఇచ్చానని బీఎల్‌ఎన్‌ రెడ్డి బదులు చెప్పినట్టు సమాచారం. నాటి పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌, పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ ఆదేశాల ప్రకారమే తాను వ్యవహరించానని, తన తప్పేమీ లేదని, లిఖిత పూర్వక ఆదేశాలు ఉన్నాయని చెప్పినట్టు తెలిసింది. ఆదేశాలను అమలు చేసే అధికారాలే తప్ప తనకు నిర్ణయాధికారం లేదని వివరించినట్టు సమాచారం. నిబంధనల ఉల్లంఘనలపై మీరు అభ్యంతరం వ్యక్తం చేయలేదా ? అని ప్రశ్నించగా.. న్యాయపరమైన సమస్యలు వస్తాయని చెప్పానని బీఎల్‌ఎన్‌ రెడ్డి బదులిచ్చారని తెలిసింది. అయినా, మంత్రి నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడం తప్ప తన స్థాయిలో వారు ఏం చేయగలరని అన్నారు. అంతా నాటి మంత్రి ఆదేశాల ప్రకారమే జరిగిందని ఆయన పదేపదే చెప్పారని తెలిసింది.


ముగిసిన తొలి దశ విచారణ !

బీఎల్‌ఎన్‌ రెడ్డి విచారణతో ఫార్ములా- ఈ కారు రేసులో తొలి దశ విచారణ ముగిసినట్టు అయింది. దీంతో ఫిర్యాదుదారుడు దాన కిషోర్‌, నాటి పురపాలకశాఖ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌, నాటి పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి విచారణలో చెప్పిన అంశాలను ఏసీబీ అధికారులు విశ్లేషిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత నిందితులను మరోసారి విచారణకు పిలవాలా ? వద్దా ? అనే అంశంపై ఏసీబీ నిర్ణయం తీసుకోనుంది.

Updated Date - Jan 11 , 2025 | 02:53 AM