ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి
ABN , Publish Date - Mar 17 , 2025 | 11:24 PM
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల ను సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయి లో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే సూచించారు.

- కలెక్టర్ వెంకటేష్ దోత్రే
ఆసిఫాబాద్, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల ను సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయి లో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరం లో అదనపు కలెక్టర్ డేవిడ్‌తో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ రకాల ప్రజాసమస్యల పరిష్కారం కోసం ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్ర మంలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో కృషిచేయాలని, పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారిం చాలని ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులు..
- రెబ్బెన మండలం గోటేటికి చెందిన మల్లయ్య తాను పుట్టుకతో దివ్యాంగుడినని తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని దరఖాస్తు అందజేశారు.
- వాంకిడి మండల కేంద్రానికి చెందిన ఎర్ర లక్ష్మీకాంత్ తనకు గిరి వికాసం పథకం కింద మంజూరైన బోరుకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు.
- ఆసిఫాబాద్ మండలం అంకుశాపూర్ గ్రామానికి చెందిన మొగిలి తాను సాగు చేస్తు న్న పోడు భూమిని సర్వే నిర్వహించి పట్టా మంజూరు చేయాలని దరఖాస్తు అందజేశారు.
- బెజ్జూరు మండలం కుకుడ గ్రామానికి చెందిన మెరుగు రమేష్ తమ గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల భవనం మరమ్మతులు చేపట్టాలని దరఖాస్తు అందజేశారు.
- కాగజ్‌నగర్ పట్టణానికి చెందిన ఓంకార్ అభిలాష్ తన తండ్రి పేరిట దహెగాం మండ లం కమ్మర్‌పల్లి శివారులో గల లావుని పట్టా భూమి కొందరు ఆక్ర మించుకున్నారని, ఈ విషయమై తనకు న్యా యం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.
- హన్మకొండ జిల్లా కు చెందిన మీర్ సలీం అలీ తనకు కౌటాల మండలం మొగడ్‌దగడ్ గ్రామ శివారులో ఉన్న పట్టా భూములకు పట్టాదారు పాసు పుస్తకం జారీ చేయాలని కోరారు.
- కౌటాల మండల కేంద్రానికి చెందిన తేలుకుంట్ల పుష్ప తనకు చెందిన ఇంటి స్థలంలో ఇతరులు వచ్చి ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఈ విషయలో న్యాయం చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు.
- రెబ్బెన మండలం పాసిగాం గ్రామానికి చెందిన శాంతబాయి తనకు గల పట్టా భూమి దరణి పోర్టల్‌లో మిస్సింగ్ అయినందున తగు చర్యలు తీసుకోవాలని దరఖాస్తు అందజేశారు.
- ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామానికి చెందిన చంద్రి లక్ష్మణ్ తమ తల్లి మరణించిందని తనకు వారసత్వ ధ్రువపత్రం జారీ చేయాలని కోరుతూ కలెక్టర్‌కు దరఖాస్తు అందజేశారు.