Telangana: కేటీఆర్‌పై మరో ఫిర్యాదు..
ABN, Publish Date - Jan 08 , 2025 | 02:01 PM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్‌పై మరో ఫిర్యాదు ఏసీబీ, ఈడీలకు చేరింది. ఓఆర్ఆర్ టోల్ అక్రమాలపై ఏసీబీ దర్యాప్తు చేయాలంటూ యుగేందర్ గౌడ్ ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్, జనవరి 08: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్‌పై మరో ఫిర్యాదు ఏసీబీ, ఈడీలకు చేరింది. ఓఆర్ఆర్ టోల్ అక్రమాలపై ఏసీబీ దర్యాప్తు చేయాలంటూ యుగేందర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. ఈ ఫార్ములా రేస్ ఒక్కటే కాదు.. ఓఆర్ఆర్ అక్రమాలపైనా విచారణ జరపాలని కోరారు. సీఎం, సీఎస్, ఈడీలతో పాటు ఏసీబీకి ఆయన ఫిర్యాదు చేశారు. ఓఆర్ఆర్ చుట్టూ మెయింటెనెన్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతం అంతా హెచ్ఎండీఏ చేస్తుందన్నారు. ఐఆర్బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కైటెక్స్ గార్మెంట్స్ కంపెనీలకు ఓఆర్ఆర్‌కు సంబంధించి 2023 ఏప్రిల్ నుంచి ముప్పై ఏళ్ల పాటు మెయింటెనెన్స్ ఇచ్చారన్నారు. రూ. 25 కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్స్ బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చింది కాబట్టే ఓఆర్ఆర్ మెయింటెనెన్స్ ఇచ్చిందని యుగేందర్ గౌడ్ తన ఫిర్యాదులో ఆరోపించారు.
ఈ వ్యవహారంలో క్విడ్ ప్రోకో ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. హెచ్ఎండీఏ నిధులపై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని యుగేందర్ డిమాండ్ చేశారు. నిదుల దుర్వినియోగంలో అధికారుల పాత్రపైనా దర్యాప్తు జరపాలని కోరారు. కాగా, ఓఆర్ఆర్ టోల్ లీజ్ వ్యవహారంపై కేటీఆర్‌తో పాటు కేసీఆర్ పైనా ఈడీ ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎలక్టోరల్ బాండ్స్‌పై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎలక్టోరల్ బాండ్స్‌ను స్క్రూటినీ చేసి ప్రభుత్వ కాంట్రాక్టు, పాలసీ నిర్ణయాలపై దర్యాప్తు జరపాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read:
విశాఖ ఎయిర్‌పోర్టుకు ప్రముఖుల తాకిడి
ఏపీ ఇంటర్ బోర్డ్ సంచలన నిర్ణయం
ఏసీబీ వరుస ప్రశ్నలు.. షాక్‌లో ఐఏఎస్
For More Telangana News and Telugu News..
Updated Date - Jan 08 , 2025 | 02:03 PM