ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AR Constable: గుండెపోటుతో ఏఆర్‌ కానిస్టేబుల్‌ మృతి

ABN, Publish Date - Jan 07 , 2025 | 04:06 AM

విధుల్లో ఉన్న ఏఆర్‌ కానిస్టేబుల్‌ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వెంటనే తోటి సిబ్బంది సీపీఆర్‌ చేస్తూ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.

మహబూబ్‌నగర్‌, జనవరి 6 (ఆంధ్రజ్యోతి) : విధుల్లో ఉన్న ఏఆర్‌ కానిస్టేబుల్‌ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వెంటనే తోటి సిబ్బంది సీపీఆర్‌ చేస్తూ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో సోమవారం జరిగింది. సీసీకుంటకు చెందిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ వెంకటేశ్‌(45) మహబూబ్‌నగర్‌లోని మర్లులో నివసిస్తూ పోలీస్‌ హెడ్‌క్వార్టర్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు.


సోమవారం జిల్లా జైలులో ఉన్న ఖైదీలను కోర్టులో హాజరుపరిచి తిరిగి వారిని జైలు వద్దకు తీసుకెళ్ళారు. జైలు వద్దకు రాగానే వెంకటేశ్‌కు కొద్దిగా గుండెపోటు ప్రారంభమైంది. నొప్పితో కుప్పకూలిపోయిన ఆయనకు వెంటనే జైలు సిబ్బంది సీపీఆర్‌ చేస్తూ వాహనంలో జనరల్‌ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మరణించాడు.

Updated Date - Jan 07 , 2025 | 04:06 AM