Astrologers Predict Political Shifts: ఏ పార్టీకి ఆ పంచాంగం
ABN , Publish Date - Mar 31 , 2025 | 05:20 AM
ఉగాది పంచాంగ పఠనంలో పండితులు సీఎం రేవంత్ పాలనపై ప్రశంసలు పొందినప్పటికీ, నరఘోష ఎదుర్కొంటారని అన్నారు. కేసీఆర్ ఈ ఏడాదే సీఎం అవుతారనే ఊహాగానాలు వెల్లువెత్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని, టీడీపీ కూటమి గెలిచే అవకాశముందని కూడా జ్యోతిష్కులు అభిప్రాయపడ్డారు.

ప్రజలు మెచ్చేలా ముఖ్యమంత్రి రేవంత్ పాలన
సీఎంకు బుధ మహర్దశ.. కానీ నరఘోష
ప్రభుత్వ కార్యక్రమంలో సంతో్‌షకుమార్ శాస్త్రి
రేవంత్‌కు పదవీ గండం.. కేసీఆర్‌కు సీఎం చాన్స్
బీఆర్‌ఎస్ ఉగాది వేడుకల్లో రాజేశ్వర సిద్ధాంతి
ఈ ఏడాది ప్రపంచ దిశానిర్దేశకుడిగా మోదీ
బీజేపీ ఆఫీసులో సూర్యనారాయణ మూర్తి
తెలంగాణలో టీడీపీ కూటమిదే విజయం
పంచాంగకర్త మల్లికార్జునశర్మ
సీఎం రేవంత్ ప్రజలు మెచ్చేలా పాలిస్తూ విపరీతమైన నరఘోష ఎదుర్కొంటారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పరుగులు పెట్టబోతుంది..!! అబ్బే.. సీఎంకు పదవీ గండాలు ఉన్నాయి. కేసీఆర్ ఈ ఏడాదే సీఎం అవుతారు. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెడితే అంతే .!! టీడీపీ కూటమి వచ్చే ఎన్నికల్లో గెలిచి తెలంగాణలో అధికారం చేపడుతుంది.!! ప్రధాని మోదీకి ఈ ఏడాది మధ్యస్థంగా ఉంటుంది.!! మోదీ చండశాసనుడిగా మారతారు, ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తారు..!! ఉగాది సందర్భంగా ప్రభుత్వం, రాజకీయ పార్టీలు నిర్వహించిన పంచాంగ పఠన కార్యక్రమాల్లో పండితులు చెప్పిన మాటలివి. ఈ కార్యక్రమాలపై ఎన్ని విమర్శలు వస్తున్నా, ఎన్నికలకు చాలా సమయం ఉందని తెలిసినా.. ఏ ఎండకా గొడుగు అన్నట్టు.. ఏ పార్టీ కార్యక్రమంలో కూర్చుంటే ఆ పార్టీకి అనుకూలంగా పంచాంగం చెప్పడం ఆనవాయితీగా మారింది. ఈ తీరు మరు ఉగాదికైనా మారుతుందో లేదో..!!
ఈ వార్తలు కూడా చదవండి...
Ugadi Wishes 2025: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్..
Ugadi Awards 2025: ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే: సీఎం చంద్రబాబు..
TDP Nara Lokesh: సీనియర్లకు గౌరవం.. జూనియర్లకు ప్రమోషన్
For More AP News and Telugu News