బాలల హక్కులపై అవగాహన కల్పించాలి
ABN , Publish Date - Apr 03 , 2025 | 11:24 PM
బాల బాలికలంద రూ తప్పనిసరిగా పాఠశాలకు వెళ్లి చదువుకోవాలని డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సి ల్ సభ్యుడు శ్రీరామ్ ఆర్య అన్నా రు.

- డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యుడు శ్రీరామ్ ఆర్య
కందనూలు, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి) : బాల బాలికలంద రూ తప్పనిసరిగా పాఠశాలకు వెళ్లి చదువుకోవాలని డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సి ల్ సభ్యుడు శ్రీరామ్ ఆర్య అన్నా రు.హైకోర్టు ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, సెక్రటరీ ఆదేశాల మేరకు చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ ఫర్ చిల్డ్ర న్ స్కీం గురించి మంతటి జడ్పీ హెచ్ స్కూల్‌లో విద్యార్థులకు అవగాహన సద స్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బాల బాలికలందరూ ఫోన్ వాడకంలో అప్రమ త్తంగా ఉండాలని అన్నారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు బాని స కాకుండా వాటికి దూరంగా ఉండాలన్నారు. ముఖ్యంగా మైనర్ బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపులకు పోక్సో చట్టం అడ్డుకట్ట వేస్తుందని అమ్మాయిలు అందరూ త మకు ఏ విధమైన సమస్యలు ఉన్న షీటీంకు గాని, చైల్డ్ హెల్ప్ లైన్ నెంబరు 1098కు గాని సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో పాఠ శాల ప్రధానోపాధ్యాయుడు తిరుపతిరెడ్డి, ఉపా ధ్యాయులు, ఉపాధ్యాయినులు, బపారాలీగల్ వలంటీర్ బాలస్వామి, విద్యార్థులు పాల్గొన్నారు.