Bhatti Vikramarka: గురుకులంలో భట్టి ఆకస్మిక తనిఖీ
ABN , Publish Date - Apr 07 , 2025 | 04:21 AM
ఖమ్మం జిల్లా వైరాలోని తెలంగాణ గురుకుల బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలను ఆదివారం రాత్రి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆకస్మికంగా తనిఖీ చేశారు.

విద్యార్థినులతో కలిసి భోజనం
వైరా, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): ఖమ్మం జిల్లా వైరాలోని తెలంగాణ గురుకుల బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలను ఆదివారం రాత్రి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. ముందుగా పాఠశాల ఆవరణలో విద్యార్థినులతో ప్రత్యేకంగా సమావేశమైన భట్టి విక్రమార్క అక్కడ వసతులు, ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సమయంలో ‘‘డిన్నర్ రెడీగా ఉందా? అంతా కలిసి భోజనం చేద్దాం పదండి’’ అంటూ పిల్లలను వెంట పెట్టుకొని ఎమ్మెల్యే రాందా్‌సనాయక్‌తో కలిసి డైనింగ్ హాల్‌కు వెళ్లారు. ఆ తర్వాత విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. మెనూ పాటిస్తున్నారా.. భోజనాల్లో నాణ్యత ఎలా ఉంటుంది? అంటూ విద్యార్థినులను ప్రశ్నించారు. దాంతో భోజనం నాణ్యత బాగుంటుందని, మెనూ పాటిస్తున్నారని విద్యార్థినులు సమాధానమిచ్చారు.