BJP: ప్రజలను పక్కదారి పట్టించేందుకే దాడులు..
ABN, Publish Date - Jan 09 , 2025 | 12:05 PM
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని, ఇందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై ఆ పార్టీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి(Sama Ranga Reddy) అన్నారు.
- బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడులు సిగ్గుచేటు
- రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి
హైదరాబాద్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని, ఇందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై ఆ పార్టీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి(Sama Ranga Reddy) అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిని ఖండిస్తూ ఎల్బీనగర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ వార్తను కూడా చదవండి: MLA: సీఎం రేవంత్‌రెడ్డిది డైవర్షన్ పాలిటిక్స్..
ఈ సందర్భంగా సామ రంగారెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న బీజేపీ పెద్ద లు, నాయకులపై మాటలతోనే కాకుండా చేతలతోనూ దాడులు చేయడం సిగ్గుచేటని, ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నినా ఎప్పటికప్పుడు నిలదీస్తూనే ఉంటామన్నారు. అధికారంలో ఉన్నామని ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని, బీజేపీ కార్యకర్తలు బయటకు వస్తే కాంగ్రెస్ నాయకులు బయటకు తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చరించారు.
ఇప్పటికైనా దాడులు చేసే సంస్కృతిని మానుకుని ప్రజా సంక్షేమంపై, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టిపెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సామ రంగారెడ్డి సూచించారు. కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నర్సింహారెడ్డి, నాయికోటి పవన్‌కుమార్, కొత్త రవీందర్‌గౌడ్, జక్కిడి ప్రభాకర్‌రెడ్డి, నీళ్ల అంజన్‌కుమార్‌గౌడ్, నాంపల్లి రామేశ్వర్, కలంశెట్టి లయ, నూతి శ్రీనివాస్, కృష్ణంరాజు, పాతూరి శ్రీధర్‌గౌడ్, యంజాల జగన్, యాదగిరియాదవ్ పాల్గొన్నారు.
మీర్‌పేట్‌లో బీజేవైఎం నేతల ఆందోళన
సరూర్‌నగర్: బీజేపీ కార్యాలయంపై మంగళవారం కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడికి నిరసనగా బుధవారం బీజేవైఎం నేతలు మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్‌పేట్‌లో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఇక్కడి కూడలిలో బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేవైఎం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు చింతల రాఘవేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనతో మీర్‌పేట్ రోడ్డుపై కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. అనంతరం సీఎం రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేయడానికి యత్నించగా మీర్‌పేట్ పోలీసులు అడ్డుకోవడంతో కొంతసేపు యువమోర్చా కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. దాంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అనంతరం పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకుని పీఎ్‌సకు తరలించారు. ఈ సందర్భంగా రాఘవేందర్ మాట్లాడుతూ పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం మానుకుని, ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని హితవు పలికారు.
హింసను ప్రేరేపిస్తున్న రేవంత్ సర్కార్
సరూర్‌నగర్: తమ పార్టీ తలచుకుంటే ఒక్క కాంగ్రెస్ కార్యాలయం కూడా మిగలదని, కానీ హింసకు ప్రతి హింస తమ సిద్ధాంతం కాదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌చార్జి అం దెల శ్రీరాములుయాదవ్ అన్నారు. రేవంత్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలో హింసను ప్రేరేపిస్తున్నదని, ఇది మంచి పద్ధతి కాదని ఆయన పేర్కొన్నారు. మంగళవారం బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడి నేపథ్యంలో బుధవారం నాదర్‌గుల్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆందెల మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తలకు సహనం ఎక్కువ అని,
అందుకే మంగళవారం నాటి ఘటనకు ప్రతి దాడులు చేయడం లేదని అన్నారు. తాము ఒక్క పిలుపు ఇస్తే బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యాలయాలను నామరూపాలు లేకుండా చేయగలుగుతారని ఆయన వ్యాఖ్యానించారు. అధికారం ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు రెచ్చిపోతే బీజేపీ శ్రేణులు చూస్తూ ఊరుకోబోరని శ్రీరాములుయాదవ్ స్పష్టం చేశారు. క్రమశిక్షణ కలిగిన తమ పార్టీని రెచ్చగొడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, మరోమారు ఇలాంటి సంఘటనలు జరిగితే సహించే ప్రసక్తేలేదని అందెల హెచ్చరించారు.
ఈవార్తను కూడా చదవండి: హైడ్రాకు ఫిర్యాదులపై రంగంలోకి రంగనాథ్
ఈవార్తను కూడా చదవండి: కేటీఆర్‌పై కేసు పెడితే రౌడీళ్లా ప్రవర్తిస్తున్నారు
ఈవార్తను కూడా చదవండి: TG News: తెలంగాణను వణికిస్తున్న పులులు
ఈవార్తను కూడా చదవండి: రేవంత్ సీఎం కావడానికి కారణమిదే.. సంచలన విషయాలు బయటపెట్టిన హరీష్‌రావు
Read Latest Telangana News and National News
Updated Date - Jan 09 , 2025 | 12:05 PM