BRS: ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్‌ఎస్ దూరం!
ABN, Publish Date - Feb 06 , 2025 | 04:04 AM
గడిచిన పదేళ్లలో ఎంపీ, ఎమ్మెల్యే, ఇతర ఏ ఎన్నికలు వచ్చినా దూకుడుగా వ్యవహరించిన బీఆర్‌ఎస్ పార్టీ ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికలపై ఏమాత్రం ఆసక్తి చూపకపోవడంతో సర్వత్రా చర్చ జరుగుతోంది.
గత పదేళ్లలో ఏ ఎన్నికలు వచ్చినా దూకుడు
ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ
చేయకూడదని నిర్ణయం!.. ఓటములే కారణం!
బీఆర్‌ఎస్ తీరుపై రాజకీయ వర్గాల్లో చర్చ
హైదరాబాద్, పిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): గడిచిన పదేళ్లలో ఎంపీ, ఎమ్మెల్యే, ఇతర ఏ ఎన్నికలు వచ్చినా దూకుడుగా వ్యవహరించిన బీఆర్‌ఎస్ పార్టీ ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికలపై ఏమాత్రం ఆసక్తి చూపకపోవడంతో సర్వత్రా చర్చ జరుగుతోంది. ‘ఎన్నికలు ఏవైనా గెలుపు మాదే’ అంటూ ధీమా వ్యక్తం చేస్తూ వచ్చిన గులాబీ పార్టీ ఈ ఎన్నికల్లో పాల్గొనకపోవడానికి కారణం ఏమై ఉంటుందని రాజకీయ వర్గాల్లో ఎవరికి తోచిన అభిప్రాయం వారు చెబుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం, ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ స్థానం కూడా దక్కకపోవడం తదితర కారణాలు ఆ పార్టీని అయోమయంలో పడేశాయని, ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందులో రెండు ఉపాఽధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు, ఒకటి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం. వీటికి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. దీనిపై ఇప్పటివరకు తమ అధినేత కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, బీఆర్‌ఎస్ తరఫున అభ్యర్థి పోటీలో ఉండరని ఆ పార్టీ నాయకులు పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలాఉండగా... రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు జరుగుతున్న కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ. దీంతో ఆ పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందన్న విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Hyderabad: మాజీ మంత్రి హరీశ్ రావుకు భారీ ఊరట.. అప్పటివరకూ అరెస్టు చేయెుద్దంటూ ఆదేశాలు..
Hyderabad: వారి తప్పుడు ప్రచారాలను బీసీ ప్రజలు నమ్మెుద్దు: మహేశ్ కుమార్ గౌడ్..
Updated Date - Feb 06 , 2025 | 04:04 AM