Share News

కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Apr 12 , 2025 | 11:51 PM

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్ర జల సంక్షేమం కోసం అనేక పథకాలను అమ లు చేస్తుందని, ప్రజలు సద్వినియోగం చేసు కోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ అన్నారు.

కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
పరిసరాలను పరిశుభ్రం చేస్తున్న బీజేపీ నాయకులు

బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌

మందమర్రిరూరల్‌, ఏప్రిల్‌ 12 (ఆంధ్ర జ్యోతి) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్ర జల సంక్షేమం కోసం అనేక పథకాలను అమ లు చేస్తుందని, ప్రజలు సద్వినియోగం చేసు కోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ అన్నారు. మండలంలోని వెం కటాపూర్‌ గ్రామంలో శనివారం బీజేపీ నా యకులు గావ్‌ చలో కార్యక్రమాన్ని మండల అధ్యక్షుడు గిర్నాటీ జనార్ధన్‌ ఆధ్వర్యంలో ని ర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్య క్షుడు పాల్గొన్నారు. గ్రామంలోని అంగన్‌ వాడీ కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం స్వచ్చత పరిశుభ్రత కార్యక్రమాలను చేపట్టారు. ఆయ న మాట్లాడుతూ కేంద్ర పథకాలతోనే ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారన్నారు. అనంతరం ప్రధాని మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశా రు. ఈ కార్యక్రమంలో నాయకులు దేవరనే ని సంజీవరావు, శివకృష్ణ, వంశీగౌడ్‌, రంజిత్‌, శ్రీనివాస్‌, రవికుమార్‌, రాజయ్య , బుచ్చన్న , లచ్చన్న పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2025 | 11:51 PM