ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Congress: ఓట్లు ఘనం.. సీట్లు సగం

ABN, Publish Date - Jan 04 , 2025 | 05:26 AM

శాసనసభ ఎన్నికల్లో విజయాన్ని సొంతం చేసుకున్న కాంగ్రెస్‌ పార్టీ.. గత ఏడాది ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో ఘనంగా ఓట్లను పొందినా సగం సీట్లనే కైవసం చేసుకోగలిగింది.

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 88.24 లక్షల ఓట్లు.. బీజేపీకన్నా 10.81 లక్షల ఓట్లు అధికం

  • అయినా 8 సీట్లలోనే హస్తం పార్టీ గెలుపు

  • బీఆర్‌ఎ్‌సకు ఒక్క సీటూ దక్కని వైనం

  • పూర్తి గణాంకాలు వెల్లడించిన ఈసీఐ

హైదరాబాద్‌, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): శాసనసభ ఎన్నికల్లో విజయాన్ని సొంతం చేసుకున్న కాంగ్రెస్‌ పార్టీ.. గత ఏడాది ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో ఘనంగా ఓట్లను పొందినా సగం సీట్లనే కైవసం చేసుకోగలిగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీలు చెరో 8 స్థానాలు గెలుచుకున్నాయి. అయితే ఓట్లపరంగా కాంగ్రెస్‌ పూర్తి ఆధిపత్యం వహించింది. బీజేపీతో పోల్చితే కాంగ్రె్‌సకు అదనంగా 10,81,014 ఓట్లు వచ్చాయి. పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్‌ ఒక్క లోక్‌సభ స్థానాన్ని గెలువలేకపోయింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పూర్తి గణాంకాలను ఇటీవల భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది. వాటిని పరిశీలిస్తే..


6 నెలల్లోనే దిగజారిన బీఆర్‌ఎస్‌ పరిస్థితి..

రాష్ట్రంలో 3,32,32,318 మంది ఓటర్లుండగా.. శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో మొత్తం 2,34,39,945 ఓట్లు పోలయ్యాయి. లోక్‌సభ ఎన్నికల్లో పోలైన ఓట్లు 2,19,04,129కు తగ్గాయి. శాసనసభ ఎన్నికల తో పోల్చితే లోక్‌సభ ఎన్నికల్లో 15,35,816 ఓట్లు తక్కువ పోలయ్యాయి. పదేళ్లు రాష్ట్రంలో అధికారం లో ఉన్న బీఆర్‌ఎస్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైం ది. 119 శాసనసభ స్థానాలకుగాను 39 స్థానాలు గెలుచుకుంది. 87,53,956 ఓట్లు సాధించింది. పోలైన ఓట్లలో 37.35ు సాధించింది. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ పోటీ చేసిన 17 స్థానాల్లోనూ ఓటమి పాలైంది. ఈ ఎన్నికల్లో 36,57,237 ఓట్లనే దక్కించుకుంది. ఇవి మొత్తం ఓట్లలో 11.01 శాతమే. 6 నెలల వ్యవధిలో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఏకంగా 50,96,719 ఓట్లు కోల్పోయింది. శాసనసభ ఎన్నికల్లో 111 స్థానాల్లో పోటీ చేసి 8 సీట్లు గెలుచుకున్న బీజేపీ 32,57,528 ఓట్లను సాధించింది. కానీ లోక్‌సభ ఎన్నికల్లో 17 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ ఏకంగా 77,43,947 ఓట్లు (35.35ు) సాధించి 8 సీట్లు గెలుచుకుంది. శాసనసభ ఎన్నికలతో పోల్చి తే బీజేపీ 44,86,419 ఓట్లు అధికంగా పొందింది.


కాంగ్రె్‌సకు పెరిగిన ఓట్ల శాతం...

శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 92,35,833 ఓట్లు (39.69ు) సాధించింది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రె స్‌కు 88,24,961 ఓట్లు (40.29ు) పోలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే లోక్‌సభ ఎన్నికల్లో 4,10,872 ఓట్లు తగ్గాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల తో పోల్చితే మొత్తంగా లోక్‌సభ ఎన్నికల్లో 15,35,816 ఓట్లు తక్కువగా పోల్‌ కావడంతో ఆ ప్రభావం కాం గ్రెస్‌ ఓట్లలో స్వల్ప తగ్గుదలకు కారణమైనట్లు స్పష్టమవుతోంది. అసెంబ్లీఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సపై 2శాతం అధిక ఓట్లతో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్‌.. లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 29.28ు అధికంగా ఓట్లు సాధించింది. లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థిగా నిలిచిన బీజేపీకన్నా 4.94ు ఓట్లు అధికంగా కాంగ్రెస్‌ సాధించింది. ఎంఐఎం.. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క స్థానంలో పోటీ చేసి దాన్ని గెలుచుకుంది. ఇక శాసనసభ ఎన్నికల్లో 119 స్థానాల్లో పోటీ చేసిన బీఆర్‌ఎస్‌ 6 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోగా.. నాడు 118 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌ 13 స్థానాల్లో.. 111 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 66 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేసిన 17 స్థానాలకు 8 స్థానాల్లో.. కాంగ్రెస్‌ హైదరాబాద్‌ స్థానంలో డిపాజిట్‌ కోల్పోగా.. బీజేపీ ఖమ్మం, మహబూబాబాద్‌ సీట్లలో డిపాజిట్లు కోల్పోయింది.

Updated Date - Jan 04 , 2025 | 05:26 AM