Share News

సిరిసిల్లలో ‘కేటీఆర్‌ టీ స్టాల్‌’ వివాదం!

ABN , Publish Date - Feb 20 , 2025 | 05:43 AM

సిరిసిల్లలో ఓ టీ స్టాల్‌ను మునిసిపల్‌ అధికారులు ట్రేడ్‌ లైసెన్స్‌ లేదంటూ మూసివేయడం వివాదాస్పదంగా మారింది. బుధవారం ఉదయం కలెక్టర్‌ సందీ్‌పకుమార్‌ ఝా సిరిసిల్ల మునిసిపల్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

సిరిసిల్లలో ‘కేటీఆర్‌ టీ స్టాల్‌’ వివాదం!

  • లైసెన్స్‌ లేదని మూసేసిన అధికారులు .. సోషల్‌ మీడియాలో వైరల్‌

  • ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు: ‘ఎక్స్‌’లో కేటీఆర్‌ పోస్ట్‌

సిరిసిల్ల, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్లలో ఓ టీ స్టాల్‌ను మునిసిపల్‌ అధికారులు ట్రేడ్‌ లైసెన్స్‌ లేదంటూ మూసివేయడం వివాదాస్పదంగా మారింది. బుధవారం ఉదయం కలెక్టర్‌ సందీ్‌పకుమార్‌ ఝా సిరిసిల్ల మునిసిపల్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అన్ని దుకాణాల ట్రేడ్‌ లైసెన్స్‌లు పరిశీలించాలని, లైసెన్స్‌లేని దుకాణాలను తొలగించాలని మునిసిపల్‌ అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో వారు.. బతుకమ్మ ఘాట్‌ వద్ద బత్తుల శ్రీనివాస్‌ అనే చిరు వ్యాపారి కేటీఆర్‌ పేరుతో నడుపుతున్న టీ స్టాల్‌ను మూసివేయించారు.


దీంతో చిరు వ్యాపారిపై కలెక్టర్‌ ప్రతాపం అంటూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. కేటీఆర్‌ పేరు, ఆయన ఫ్లెక్సీ పెట్టుకోవడంతోనే తన టీ స్టాల్‌ను మూసివేయించారని శ్రీనివాస్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనకు మద్దతుగా బీఆర్‌ఎస్‌ నేతలు ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. దీనిపై మాజీ మంత్రి కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని, ప్రతీది గుర్తు పెట్టుకుంటున్నానని హెచ్చరిస్తూ.. టీ స్టాల్‌ నిర్వాహకుడు శ్రీనివాస్‌ మాట్లాడిన వీడియోను పోస్ట్‌ చేశారు.

Updated Date - Feb 20 , 2025 | 05:43 AM