PG Course Delay: కామారెడ్డి డెయిరీ కళాశాల పీజీ అనుమతుల్లో జాప్యం
ABN , Publish Date - Apr 07 , 2025 | 03:59 AM
కామారెడ్డి డెయిరీ కళాశాలలో పీజీ కోర్సుల అనుమతులు ఇవ్వడానికి ప్రభుత్వం ఏమీ చర్యలు తీసుకోలేదు. ప్రతిపాదనలు పంపి ఏడాది అవుతున్నా, విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోంది

ప్రతిపాదనలు పంపి ఏడాది అవుతున్నా పట్టించుకోని ప్రభుత్వం
పీజీ కోర్సుల కోసం పొరుగు రాష్ట్రాలకు విద్యార్థులు
ప్రస్తుతం డెయిరీ టెక్నాలజీ కోర్సుకు మంచి డిమాండ్
కామారెడ్డి, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): కామారెడ్డి డెయిరీ టెక్నాలజీ కళాశాలలో పీజీ కోర్సుల అనుమతుల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అనుమతుల కోసం ప్రతిపాదనలు పంపి ఏడాది అవుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ప్రస్తు తం మార్కెట్‌లో డెయిరీ టెక్నాలజీ కోర్సులకు మంచి డిమాండ్ ఉంది. రాష్ట్రంలో ఉన్న ఏకైక డెయిరీ కళాశాల కామారెడ్డి జిల్లా కేంద్రంలోనిదే. ఇక్కడ డెయిరీ కోర్సులు చదువుతుండగానే విద్యార్థులకు మంచి ఉద్యోగావకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలో కళాశాలలో పీజీకోర్సులు లేకపోవడంతో విద్యార్థులు ఉన్నత చదువుల కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి. విద్యార్థులు హరియాణా, కేరళ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో ఆర్థిక భారంతో ఉన్నత చదువులు చదవాల్సి వస్తోంది. దీంతో ఈ కళాశాలలో పీజీ కోర్సులను అందుబాటులోకి తీసుకురావాలని విద్యార్థులు కోరుతున్నారు. ఈ కళాశాలలో పీజీ కోర్సులకు అవసరమైన సౌకర్యాలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో అప్ప టి కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి కళాశాలకు 60 ఎకరాల భూమిని కేటాయించింది. రూ.11 కోట్లతో కళాశాల భవనం, హాస్టళ్లు, ఆడిటోరియం, ల్యాబ్‌లు అప్పటి ప్రభుత్వంలోనే నిర్మించారు. ప్రస్తుతం విద్యార్థులు ప్రాక్టీకల్స్‌లో భాగంగా పాలపదార్థాలు తయా రు చేసి డెయిరీ పార్లర్‌ను కూడా నిర్వహిస్తున్నారు.
ఈ కళాశాలలో ఇప్పటి వరకు సుమారు 1000 మంది విద్యార్థులు చదువు పూర్తి చేశారు. నాలుగున్నర దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు దేశ విదేశాలలో ఉన్నత ఉద్యోగాలు, వ్యాపారాల్లో స్థిరపడ్డారు. విద్యార్థులకు చదువు పూర్తయిన వెంటనే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు దక్కుతున్నాయి. రాష్ట్ర్ట్రంలో పేరొందిన జెర్సీ డెయిరీ డైరెక్టర్లంతా ఈ కళాశాల విద్యార్థులు కావడం విశేషం. అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికాతో పాటు గల్ఫ్ దేశాల్లోనూ డెయిరీ రంగంలో ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవల్‌పమెంట్ కార్పొరేషన్‌లోనూ చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు. డెయిరీ కోర్సులు చేసిన వారు ఫుడ్ సేఫ్టీ అధికారులు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, సూపర్‌వైజర్ వంటి ఉద్యోగాలు పొందే వీలుంది. సొంతంగా ఉపాధి కూడా పొందవచ్చు. ఉపకార వేతనాలు, మెరిట్ స్కాలర్‌షి్‌పలు అందుకోవచ్చు.
అధ్యాపకుల కొరత
డెయిరీ టెక్నాలజీ కళాశాలలో రెగ్యులర్ అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉంది. ఈ కళాశాలలో 24 మంది అధ్యాపకులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఇద్దరు మాత్రమే రెగ్యులర్ ప్రొఫెసర్‌లు ఉన్నారు. 10 మంది కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్నారు. కళాశాలకు 12 మంది పూర్తిస్థాయి ప్రొఫెసర్‌ల నియామకం కోసం కళాశాల నిర్వాహకులు ప్రతిపాదనలు పంపారు.
చదువు పూర్తవగానే ఉద్యోగాలు
ఈ కళాశాలలో నాలుగేళ్ల కోర్సు చేసిన విద్యార్థులకు చదువు పూర్తి చేయగానే ప్రైవేట్, స్వయం ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటా యి. ఇంటర్ ఎంపీసీ పూర్తి చేసిన విద్యార్థులు ఎంసెట్ ర్యాంకు సాధిస్తే ఈ కళాశాలలో చదువుకోవచ్చు. కళాశాలకు పీజీ కోర్సులు మంజూరు చేయాలని అధికారులకు ప్రతిపాదనలు పంపించాం.
- ఉమాపతి, అసోసియేట్ డీన్
ఈ వార్తలు కూడా చదవండి..
HCU Land: హెచ్‌సీయూ వివాదంలో నిజాలు ప్రచారం చేయండి
No Exam: ఈ అర్హత చాలు.. పరీక్ష లేకుండా ఉద్యోగం.. నెలకు రూ. 2 లక్షల జీతం
Water Conflict: నీటి పంచాయతీ.. అధికారులతో ఉత్తమ్ కీలక భేటీ
Healthy Soup: ఈ సూప్‌తో మీ శరీరంలో కొన్ని భాగాలకు ఊహించని శక్తి పక్కా
Cotton Clothing: కాటన్ దుస్తులు.. ఒరిజినలా? కాదా? ఎలా గుర్తించాలంటే..
Fake Cardiologist: ఏడుగురి ఉసురు తీసిన వైద్యుడు.. విచారణకు రంగం సిద్ధం
శ్రీలీలకి చేదు అనుభవం.. చెయ్యి పట్టుకుని లాగిన యువకులు
కేసు No.62.. సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్ పై విచారణ
For Telangana News And Telugu News