ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: నిషేధం ఉన్నా.. చైనా మాంజా అమ్మకాలు

ABN, Publish Date - Jan 04 , 2025 | 08:58 AM

సంక్రాంతి పండుగ(Sankranti festival) కొందరి ఇళ్లలో తీరని విషాదం నింపుతోంది. దీనికి కారణం పతంగలు ఎగరేసేందుకు వినియోగించే చైనా మాంజా. ఇది మెడకు చుట్టుకుని గ్రేటర్‌లో గతంలో 8 మంది మృతిచెందారు.

- ఒక్క రోజే 14 కేసులు నమోదు

- 947 బండిళ్ల చైనా మాంజా స్వాధీనం

- గతంలో గ్రేటర్‌లో 8 మంది మృతి

హైదరాబాద్‌ సిటీ: సంక్రాంతి పండుగ(Sankranti festival) కొందరి ఇళ్లలో తీరని విషాదం నింపుతోంది. దీనికి కారణం పతంగలు ఎగరేసేందుకు వినియోగించే చైనా మాంజా. ఇది మెడకు చుట్టుకుని గ్రేటర్‌లో గతంలో 8 మంది మృతిచెందారు. గతేడాది లంగర్‌హౌజ్‌ ఫ్లైవోవర్‌పై తెగిపడిన చైనా మాంజా(Chinese manja) బైక్‌పై వెళ్తున్న ఒక సైనికుడి మెడకు చుట్టుకోవడంతో మృతిచెందిన విషయం తెలిసిందే. తెగిపడిన చైనా మాంజాలు చిక్కుకుని పదుల సంఖ్యలో పక్షులు కూడా మృతిచెందాయి. ఈ చైనా మాంజాపై ప్రభుత్వ నిషేధం ఉన్నా నగరంలో విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయి.

ఈ వార్తను కూడా చదవండి: Minister: నుమాయిష్‌ ద్వారా వచ్చే ఆదాయంతో విద్యాసంస్థల సంఖ్యను పెంచాలి


టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల స్పెషల్‌ డ్రైవ్‌..

నిషేధిత మాంజాను విక్రయిస్తున్న దుకాణాదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారు. సిటీ పోలీస్‌ కమిషనర్‌(City Police Commissioner) ఆదేశాల మేరకు నగరంలో స్పెషల్‌ డ్రైవ్‌ చేపడుతున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ అడిషనల్‌ డీసీపీ అందె శ్రీనివాస్‌ తెలిపారు. పురానీహవేలీలోని డీసీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సౌత్‌జోన్‌, ఈస్ట్‌జోన్‌, సౌత్‌ ఈస్ట్‌, సౌత్‌ వెస్ట్‌ జోన్‌లో ఎక్కువగా అమ్ముడయ్యే చైనా మాంజాపై స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టినట్లు తెలిపారు. ఒక్కరోజే 14 మంది విక్రయదారులపై కేసులు నమోదు చేశామని, వారి వద్ద నుంచి 987 చైనా మాంజా బండిళ్లను(బాబిన్స్‌) స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.


అత్యధికంగా అఫ్జల్‌గంజ్‌-360, ఆసి్‌ఫనగర్‌-170, షాహినాఽథ్‌గంజ్‌-102, చిలకలగూడ-80, టప్పాచబుత్ర-162 బండిళ్లను సీజ్‌ చేసినట్లు అడిషనల్‌ డీసీపీ వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించి చైనా మాంజాలను విక్రయిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని, నేరస్థులకు పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం ఏడాది నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ. లక్ష వరకు జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. చైనా మాంజాకు వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ పరిరక్షణ సంస్థ ల ప్రతినిధులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.


ఈవార్తను కూడా చదవండి: Nampally Court : అల్లు అర్జున్‌కు ఊరట

ఈవార్తను కూడా చదవండి: ‘మా శవయాత్రకు రండి’ వ్యాఖ్యపై కేసు కొట్టివేయండి: కౌశిక్‌రెడ్డి

ఈవార్తను కూడా చదవండి: West Godavari: ఏపీ యువకుడి దారుణ హత్య

ఈవార్తను కూడా చదవండి: Bus Accident: కేరళలో అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా

Read Latest Telangana News and National News

Updated Date - Jan 04 , 2025 | 08:58 AM