ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

DGP Jitender: 90 గంటల పనిపై యువత ఆలోచించాలి!

ABN, Publish Date - Jan 13 , 2025 | 04:07 AM

‘‘భారతీయులు వారానికి 90 గంటలు ఎందుకు పని చేయరని ఓ పారిశ్రామికవేత్త అన్నారు. ఇది నేటి యువత బాగా ఆలోచించాల్సిన విషయం’’ అని డీజీపీ జితేందర్‌ అభిప్రాయపడ్డారు.

  • సెలవుల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు

  • ‘క్వాంట పీపుల్‌’ కార్యక్రమంలో డీజీపీ జితేందర్‌

రాంగోపాల్‌పేట్‌, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ‘‘భారతీయులు వారానికి 90 గంటలు ఎందుకు పని చేయరని ఓ పారిశ్రామికవేత్త అన్నారు. ఇది నేటి యువత బాగా ఆలోచించాల్సిన విషయం’’ అని డీజీపీ జితేందర్‌ అభిప్రాయపడ్డారు. వారానికి 5-6 రోజులు పనిచేస్తామని అనకూడదని.. ఎక్కువగా సెలవుల గురించి ఆలోచించకుండా మెక్‌ డొనాల్డ్స్‌, స్విగ్గీ, జోమాటో, డబ్బావాలా వంటి నూతన ఆలోచనలకు శ్రీకారం చుట్టాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు. అలాంటివారిని కార్పొరేట్‌ కంపెనీలు ప్రోత్సహించాలని అభిప్రాయపడ్డారు.


జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఆదివారం టీఎంఐ కార్పొరేట్‌ కార్యాలయంలో జరిగిన ‘క్వాంట పీపుల్‌’ పేరిట టీఎంఐ నెలకొల్పిన స్టార్టప్‌ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముంబైకి చెందిన 12 ఏళ్ళ బాలుడు లాజిస్టిక్‌ యాప్‌ తయారుచేసి డబ్బావాలతో టై-అప్‌ అయ్యాడని.. రెండేళ్లలో దాని టర్నోవర్‌ రూ.200 కోట్లకు చేరుకున్నట్టు ఇటీవలే ఒక పత్రికలో చదివానని గుర్తుచేసుకున్నారు. కార్పొరేట్‌ కంపెనీలు యువతను ప్రోత్సహించి అలాంటి ఆవిష్కరణలకు చేయూతనివ్వాలని సూచించారు. ఎస్‌బీఐ హైదరాబాద్‌ సర్కిల్‌ సీజీఎం రాజేష్‌ కుమార్‌, టీఎంఐ సిటీవో సమీర్‌ గోస్వామితో పాటు పలువురు పాల్గొన్నారు.

Updated Date - Jan 13 , 2025 | 04:07 AM