Share News

జాతరలు మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి

ABN , Publish Date - Apr 09 , 2025 | 12:56 AM

: జాతరలు, ఉత్సవాలు సంస్కృతీ, సం ప్రదాయాలను ప్రతిబింబిస్తాయని హైదరాబాద్‌ ఇంటలిజెన్స్‌ డీఎస్పీ చవ్వా శంకర్‌రెడ్డి అన్నారు.

జాతరలు మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి
బహుమతులు అందచేస్తున్న హైదరాబాద్‌ ఇంటెలిజిన్స్‌ డీఎస్పీ చవ్వా శంకర్‌రెడ్డి

తిరుమలగిరి(సాగర్‌), ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): జాతరలు, ఉత్సవాలు సంస్కృతీ, సం ప్రదాయాలను ప్రతిబింబిస్తాయని హైదరాబాద్‌ ఇంటలిజెన్స్‌ డీఎస్పీ చవ్వా శంకర్‌రెడ్డి అన్నారు. శ్రీరామనవమి సందర్భంగా నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్‌) లో రాష్ట్రస్థాయి మహిళా కోలాటాలు, ఎడ్ల పందేల విజేతలకు బహుమతులు అందజేశారు.

కోలాట పోటీల విజేతలు

మహిళా కోలాట పోటీల్లో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలోని గూడూరుకు చెందిన శ్రీఆంజనేయస్వామి కోలాట బృందం(ప్రథమ), సూర్యాపేట జిల్లా పాండ్య నాయక్‌తండాకు చెందిన చందులాల్‌కోలాట బృందం(ద్వితీయ), అచ్చంపేట అమ్రా బాద్‌కు చెందిన అమరేశ్వర కోలాట బృందం(తృతీయ), సూర్యాపేట జిల్లా గరిడేపల్లికి చెందిన హరేశ్రీనివాస కోలాట బృందం(నాలుగో), మేళ్లచెర్వుకు చెందిన మేరమ్మతల్లి కోలాట బృందం(ఐదో స్థానం), సంగూనితండాకు చెందిన బంగారు మైసమ్మతల్లి కోలాట బృందం(6వ స్థానం), బుడియబాపు కోలాట బృందం(7వ స్థానం) సాధించాయి.

ఎడ్ల పందేల విజేతలు

రాష్ట్రస్థాయి ఎద్దుల పందేల పోటీల్లో ప్రకాశం జిల్లా వేటపాలేనికి చెందిన అత్తోట శిరీషచౌదరి, శివకృష్ణచౌదరి ఎద్దుల జత(మొదటి స్థానం), గుంటూరు జిల్లాకు చెందిన సోమిశెట్టి ఆంజనేయులు ఎద్దుల జతలు(రెండవ స్థానం), ప్రకాశం జిల్లా బాపట్ల మండలం చిననందిపాడుకు చెందిన పమిడి సుష్మాంత్‌బాబు ఎద్దుల జతలు (మూడో స్థానం), గుంటూరు జిల్లా లింగాయపాలేనికి చెందిన ఎల్లం సాంబశివరావు ఎద్దుల జతలు(నాలుగో స్థానం) నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం సూరేపల్లికి చెందిన సంకూరి అనంతరాములు ఎద్దుల జతలు(5వ బహుమతి), పల్నాడు జిల్లా అమరావతి మండలం గిడుగు గ్రామానికి చెందిన బండి సాహితి శ్రీభవన్‌ ఎద్దుల జతలు(6వ బహుమతి), నల్లగొండ జిల్లా గాత్‌తండాకు చెందిన మెగావత్‌ మంగ్యానాయక్‌ ఎద్దుల జతలు(7వ బహుమతి), గెలుపొందాయి. ఈ కార్యక్రమంలో శ్రవణ్‌కుమార్‌రెడ్డి, చవ్వా బుచ్చిరెడ్డి, షేక్‌ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 09 , 2025 | 12:56 AM