నేటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు
ABN , Publish Date - Apr 13 , 2025 | 11:24 PM
జిల్లాలో ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక శాఖ వారోత్సవా లు నిర్వహించనున్నట్లు అగ్నిమాపక శాఖ అధికారి ఇంజమూరి కృష్ణమూ ర్తి తెలిపారు.

కందనూలు, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యో తి) : జిల్లాలో ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక శాఖ వారోత్సవా లు నిర్వహించనున్నట్లు అగ్నిమాపక శాఖ అధికారి ఇంజమూరి కృష్ణమూ ర్తి తెలిపారు. వారోత్సవాలకు సంబం ధించిన వాల్‌పోస్టర్లను అదనపు కలెక్ట ర్ పి.అమరేందర్ విడుదల చేశారు. అగ్ని మాపక శాఖ వారోత్సవాల్లో మొదటి రోజు ఏప్రిల్ 14న అగ్నిమా పక స్టాళ్ల ఏ ర్పాటు, అమరులకు మౌనం పాటించి నివాళి, 15న బస్టాండ్, రైల్వేస్టేషన్, సినిమా హాల్స్ వం టి బహిరంగ ప్రదేశాల్లో అవగాహన, 16న గృహసముదాయాల్లో అవగాహన, 17న ఎల్‌పీజీ గోడౌన్స్, పెట్రోల్ పంపు దగ్గర అవ గాహన, 18న ఆసుపత్రుల్లో ఫస్ట్ ఎయిడ్ గురిం చి, 19న పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పించనున్నట్లు వివరించారు.