ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Damodara Rajanarsimha: ఎస్‌హెచ్‌జీ మహిళల ఆధ్వర్యంలో మొదటి పెట్రోల్‌ బంకు

ABN, Publish Date - Jan 04 , 2025 | 05:07 AM

రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల(ఎ్‌సహెచ్‌జీ) ఆధ్వర్యంలో మొట్టమొదటి మహిళా పెట్రోల్‌ బంకును సంగారెడ్డిలో ఏర్పాటు చేస్తుండటం ఆనందంగా ఉందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.

  • సంగారెడ్డిలో మంత్రి దామోదర శంకుస్థాపన

సంగారెడ్డి రూరల్‌, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల(ఎ్‌సహెచ్‌జీ) ఆధ్వర్యంలో మొట్టమొదటి మహిళా పెట్రోల్‌ బంకును సంగారెడ్డిలో ఏర్పాటు చేస్తుండటం ఆనందంగా ఉందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో మహిళా పెట్రోల్‌ బంకు నిర్మాణం, ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మోడల్‌ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఆయన శుక్రవారం శంకుస్థాపన చేశారు. మహిళా సమాఖ్య షాపింగ్‌ కాంప్లెక్స్‌తో పాటు పలు అభివృద్ధి పనులనూ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళలు పెట్టుబడులు పెట్టే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.


సంగారెడ్డి పట్టణ ప్రజలకు తాగునీటి సరఫరా కోసం రూ.44 కోట్లతో అమృత్‌ జల్‌ పథకాన్ని, మహిళ సంక్షేమం, ఆర్థికాభివృద్ధి కోసం మహిళా శక్తి పథకాన్ని చేపట్టినట్లు చెప్పారు. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం భవిష్యత్తులో ప్రభుత్వ కాంట్రాక్టులను మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందకు పెట్రోల్‌ బంకు, మహిళ షాపింగ్‌ కాంప్లెక్స్‌ మంజూరు చేసేందుకు సహకరించిన అధికారులను మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు అభినందించారు. జిల్లాలో మహిళల ఆర్థిక అభివృద్ధి కోసమే ప్రభుత్వం మహిళాశక్తి పథకాన్ని తీసుకువచ్చిందని టీజీఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మలా జగ్గారెడ్డి అన్నారు.

Updated Date - Jan 04 , 2025 | 05:07 AM