Secunderabad: బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఉద్యాన్ ఉత్సవ్
ABN, Publish Date - Jan 03 , 2025 | 07:21 AM
సికింద్రాబాద్ బొల్లారం(Secunderabad Bollaram)లోని రాష్ట్రపతి నిలయంలో ‘ఉద్యాన్ ఉత్సవ్’ గురువారం ప్రారంభమైనది. ‘ఉద్యాన్ ఉత్సవ్’ జనవరి 2 నుంచి 13 వరకు నిర్వహిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతుల అభివృద్దికి నిర్వతం కృషి చేయడానకి ఉధ్యాన్ ఉత్సవ్‌ను ఏర్పాటు చేశారు.
- ప్రారంభించిన రైతు చింతపల్లి సురేష్‌కుమార్‌రెడ్డి
- 13 వరకు కార్యక్రమాలు, 50 స్టాల్స్ ఏర్పాటు
సికింద్రాబాద్: సికింద్రాబాద్ బొల్లారం(Secunderabad Bollaram)లోని రాష్ట్రపతి నిలయంలో ‘ఉద్యాన్ ఉత్సవ్’ గురువారం ప్రారంభమైనది. ‘ఉద్యాన్ ఉత్సవ్’ జనవరి 2 నుంచి 13 వరకు నిర్వహిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతుల అభివృద్దికి నిర్వతం కృషి చేయడానకి ఉధ్యాన్ ఉత్సవ్‌ను ఏర్పాటు చేశారు. ప్రగతీశీల రైతు చింతపల్లి సురేష్ కుమార్‌రెడ్డి, వ్యవసాయ మంత్రిత్వశాఖ, రైతు సంక్షేమశాఖ సంయుక్త కార్యదర్శి శామ్యూల్ ప్రవీణ్‌కుమార్, రాష్ట్రపతిభవన్ డైరెక్టర్ శివేంద్ర చతుర్వేదితో కలిసి గురువారం ప్రారంభించారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ‘మైదానంలో మందు పార్టీ’పై కమిషనర్ సీరియస్
ఉద్యాన్ ఉత్సవ్‌లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ హర్టికల్చర్, (ఏపీ, తెలంగాణ), వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్(మేనేజ్) హైదరాబాద్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, డాక్టర్ వె.ఎస్. ఆర్ హార్టీకల్చర్ యూనివర్సిటీ తదితర ఎన్‌జీవోలు కమ్యూనిటీ ఆర్గనైజేషన్ సహకారంతో ఉద్యాన్ ఉత్సవ్‌ను నిర్వహిస్తున్నారు. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపదిముర్ము(President Draupadi Murmu) హైదరాబాద్‌కు శీతాకాల విడిదికి వచ్చిన సందర్భంగా ఈ ఉద్యాన్ ఉత్సవ్ మేళాను ప్రకటించారు.
న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఏడాదికి రెండుసార్లు నిర్వహించే అమృత్ ఉద్యాన కార్యక్రమాన్ని స్పూర్తిగా తీసుకొని తొలిసారి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఉద్యాన్ ఉత్సవ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. రోజూఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్రవేశం ఉచితం. 50 స్టాల్స్‌ను ఏర్పాటు చేయగా, మొదటి రోజు 6000 మంది సందర్శకులు హాజరయ్యారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతుల అభివృద్దికి నిర్వతం కృషి చేయడానకి ఉధ్యాన్ ఉత్సవ్‌ను ఏర్పాటు చేశారు.
ఉద్యానవనశాఖ, వ్యవసాయశాఖలో అవలంభిస్తున్న నూతన సాగు పద్ధతులను వివరించే సేంద్రీయ ఎరువలు, కంపోస్టింగ్, గార్డెనింగ్ టూల్స్, గారెడన్ డెకర్, హర్టికల్చర్‌రంగానికి చెందిన వివిధ రకాల స్టాల్స్ ఏర్పాటు చేశారు. రైతు సాధికార సమితి ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో సహజ వ్యవసాయం, సుస్థిర హర్టికల్చర్ పద్ధతులు, ఆలుగడ్డ, అల్లం పంటలు, సీజనల్ కూరగాయల పంటల సాగుపై వర్క్‌షా్‌పను నిర్వహించారు. సౌత్ సెంట్రల్‌జోన్ కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో ఒడిశాకు చెందిన శంఖవదానం, రానప్ప,
ఛాదేయ, మహారాష్ట్రకు చెందిన లావాని, కోలి, వాగ్యమురళి నృత్యం, తెంగాణకు చెందిన బోనాలు, లంబాడి నృత్యం, మధ్యప్రదేశ్‌కు చెందిన తాత్య, గోండి, కర్మ, దంధర్‌వంటి జానపద, ఆదివాసి నృత్యాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో వ్యవసాయ మంత్రిత్వశాఖ, రైతు సంక్షేమశాఖ సంయుక్త కార్యదర్శి శామ్యూల్ ప్రవీణ్‌కుమార్, మేనేజ్ డైరెక్టర్ శరవణన్‌రాజ్, ఐసీఏఆర్- ఏటీఏఆర్‌ఐ డైరెక్టర్ షెక్ మీరా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, తెలంగాణ ఏడీఏ హేస్సేన్‌బాబు, సంజయ్‌కుమార్, రాష్ట్రపతిభవన్ డైరెక్టర్ శివేంద్రచతుర్వేది, పీఆర్‌వో కుమార్ సమరేష్, రాష్ట్రపతి నిలయం అధికారి రజనిప్రియ తదితరులు పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Formula E Race: ఇదేం ఫార్ములా?
ఈవార్తను కూడా చదవండి: 765 చెరువుల ఎఫ్‌టీఎల్ నిర్ధారణ
ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ: హరీశ్ రావు
ఈవార్తను కూడా చదవండి: అన్నదాతలకు రేవంత్ సున్నంపెట్టే ప్రయత్నం
Read Latest Telangana News and National News
Updated Date - Jan 03 , 2025 | 07:21 AM