TS News: టోల్ సిబ్బందిపై దాడి
ABN , Publish Date - Apr 15 , 2025 | 03:32 PM
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సమీపంలోని టోల్ సిబ్బందిపై దాడి జరిగింది. రాజేంద్రనగర్ ఎగ్జిట్-17 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. టోల్ సిబ్బంది డబ్బులు అడిగినందుకు.. జూనియర్ అసిస్టెంట్ హుస్సేన్ సిద్ధికి, అతని కుటుంబ సభ్యులు వారిపై దాడికి పాల్పడ్డారు.

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సమీపంలోని టోల్ సిబ్బందిపై దాడి జరిగింది. రాజేంద్రనగర్ ఎగ్జిట్-17 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. టోల్ సిబ్బంది డబ్బులు అడిగినందుకు.. జూనియర్ అసిస్టెంట్ హుస్సేన్ సిద్ధికి, అతని కుటుంబ సభ్యులు వారిపై దాడికి పాల్పడ్డారు. తన కారుకు టోల్ మినహాయింపు ఇవ్వాలని హుస్సేన్ సిద్ధికి టోల్ సిబ్బందిని కోరాడు.
అయితే ఆ కారుకు టోల్ మినహాయింపు లేకపోవడంతో డబ్బులు చెల్లించాలని టోల్ సిబ్బంది తెలిపారు. దీంతో హుస్సేన్ సిద్ధి ఒక్కసారిగా కోపంతో ఉగిపోయాడు. వాహనం ఆపినందుకు టోల్ సిబ్బందిపై ఆగ్రహంతో దాడి చేశాడు. గోడవను అడ్డుకోబోయిన ఇతర టోల్ సిబ్బందిపై సైతం దాడికి పాల్పడ్డారు. ఈ దాడిపై హుస్సేన్ సిద్ధికితో పాటూ అతని కుటుంబ సభ్యులపైనా పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుస్సేన్ సిద్ధికి.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.