Share News

Hyderabad: పెద్దప్లానే వేశారుగా.. రూ.10 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం కబ్జా

ABN , Publish Date - Apr 09 , 2025 | 08:04 AM

నగరంలో.. అత్యంత ఖరీదైన ఏరియాల్లో ఒకటైన బంజారాహిల్స్‌లో దాదాపు రూ.10 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు యత్నించారు. విషయం తెలుసుకున్న అధికారులు కబ్జాను అడ్డుకున్నారు. కబ్జాదారులపై అధికారులు కేసులు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: పెద్దప్లానే వేశారుగా.. రూ.10 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం కబ్జా

- బండరాయిని పగులకొట్టి నిర్మాణానికి యత్నం

- అడ్డుకున్న అధికారులు

- నిర్మాణదారుడు, కాంట్రాక్టర్‌పై కేసు నమోదు

హైదరాబాద్: బంజారాహిల్స్‌లో రూ.10 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు యత్నించారు. అధికారులు స్పందించి కబ్జాను అడ్డుకున్నారు. షేక్‌పేట తహసీల్దార్‌ అనితారెడ్డి(Sheikhpet Tahsildar Anitha Reddy) కథనం ప్రకారం జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్టు(Jubilee Hills Check Post) సమీపంలోని సత్వా ఎన్‌క్లేవ్‌ పక్క వీధిలో సర్వే నంబరు 403/పి, టీఎస్‌ నెంబరు 1/పిలో ప్లాట్‌ నంబరు 85, 86లో ప్రభుత్వానికి చెందిన స్థలం ఉంది.

ఈ వార్తను కూడా చదవండి: AV Ranganath: రాంకీ కబ్జాపై రంగనాథ్‌ పరిశీలన..


ఈ స్థలానికి అనుకొని శ్రీధర్‌ రావు అనే వ్యక్తి ప్లాట్‌ ఉంది. కొద్ది రోజుల క్రితం తన ప్లాట్‌లో నిర్మాణాలు చేపట్టాడు. అతని కన్ను పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలంపై పడింది. మొదట ఆ స్థలంలోని పెద్ద బండరాయిని రెండు నెలల పాటు పని చేయించి తొలగించాడు. అందులో నిర్మాణాలు చేపట్టేందుకు సెంట్రింగ్‌ సామాన్లను దించాడు. పని మొదలు పెట్టాడు. ప్రభుత్వ స్థలాల తనిఖీలో భాగంగా కొద్దిరోజుల క్రితం షేక్‌పేట రెవెన్యూ అధికారులు ప్లాట్‌ నంబరు 85,86 వద్దకు వచ్చారు.


city3.jpg

బండరాయి మాయం కావడంతో పాటు నిర్మాణాలు జరుగుతుండటంతో ఆశ్చర్యానికి గురయ్యారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నెల 7న అర్ధరాత్రి సమయంలో పనులు జరుగుతుండడంతో స్థానికుల ఫిర్యాదు మేరకు సికింద్రాబాద్‌ ఆర్డీఓ సంధ్య, షేక్‌పేట తహసీల్దార్‌ అనితారెడ్డి సిబ్బందితో కలిసి అడ్డుకున్నారు. నిర్మాణాలు ఆపేయాలని ఆదేశించారు.


జూబ్లీహిల్స్‌ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఏసీపీ వెంకటగిరి(ACP Venkatagiri) ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడున్న సామాగ్రిని అధికారులు సీజ్‌ చేశారు. మంగళవారం ఆ స్థలంలో ప్రభుత్వ సూచిక బోర్డు ఏర్పాటు చేశారు. అధికారుల ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు గుంటి శ్రీధర్‌రావు, కాంట్రాక్టర్‌ నర్సింహారావుపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బిల్లుల కోసం సత్యాగ్రహం చేస్తాం

ఉదయం ఎండ .. సాయంత్రం వాన

నగరంలో కొత్తగా 6 ఎంఎంటీఎస్‌ ట్రైన్‌ లైన్లు

Read Latest Telangana News and National News

Updated Date - Apr 09 , 2025 | 08:04 AM