Recruitment: జీపీవోకు అర్హతలివే..
ABN, Publish Date - Mar 30 , 2025 | 01:20 AM
గత ప్రభుత్వం రద్దు చేసిన వీఆర్‌వో, వీఆర్‌ఏల స్థానంలో గ్రామ పాలనాధికారి(జీపీవో) పోస్టును తేవాలని భావిస్తున్న ప్రభుత్వం అందుకు సంబంధించి కసరత్తులు చేస్తోంది.
డిగ్రీ లేదా ఇంటర్మీడియట్
వీఆర్‌వో/వీఆర్‌ఏ ఐదేళ్ల సర్వీసు
రాత పరీక్షతో నియామకం
గత సర్వీసు కాలం జీరో
గ్రామ పాలనాధికారి పోస్టు మార్గదర్శకాలు జారీ
హైదరాబాద్, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వం రద్దు చేసిన వీఆర్‌వో, వీఆర్‌ఏల స్థానంలో గ్రామ పాలనాధికారి(జీపీవో) పోస్టును తేవాలని భావిస్తున్న ప్రభుత్వం అందుకు సంబంధించి కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా జీపీవో నియామకానికి అవసరమైన మార్గదర్శకాలను విడుదల చేస్తూ రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌మిట్టల్ శనివారం జీవో జారీ చేశారు. దీని ప్రకారం గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా ఇంటర్ విద్యార్హత కలిగి ఉండి.. గ్రామ రెవెన్యూ అఽధికారి(వీఆర్‌వో)/గ్రామ రెవెన్యూ సహాయకుడు(వీఆర్‌ఏ)గా కనీసం ఐదేళ్ల పాటు పనిచేసిన వారు జీపీవో పోస్టుకు అర్హులు. వీరి నుంచి ఆప్షన్లు తీసుకున్నాక.. రెవెన్యూ శాఖపై రాత పరీక్ష పెడతారు. ఆ ఫలితాల ఆధారంగా నియామకం చేస్తారు. నియామక అధికారం భూపరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్‌ఏ)/ లేదా సీసీఎల్‌ఏ ద్వారా అధికారాలు పొందిన వారికే ఉంటుంది. త్వరలోనే జీపీవో సర్వీసు రూల్స్‌ను ప్రభుత్వం విడుదల చేయనుంది. దాంతోపాటు ప్రస్తుతం పొందుతున్న వేతనానికి రక్షణ ఉంటుంది. ఇక, ఇంతకు ముందు రెవెన్యూ శాఖలో వీఆర్‌వో, వీఆర్‌ఏగా పని చేసిన సర్వీసు కాలాన్ని లెక్కలోకి తీసుకోరు.
ఇవీ బాధ్యత లు
గ్రామ రికార్డుల నిర్వహణ.
సర్టిఫికెట్ల కోసం వచ్చే దరఖాస్తుల పరిశీలన, విచారణ.
ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవడం. చెరువులు, నీటి కుంటల రక్షణ.
భూములతో పాటు ముడిపడిన వివాదాలపై విచారణ. భూముల సర్వేకు వచ్చే సర్వేయర్లకు సహకారం అందించడం.
విపత్తుల సమయంలో అత్యవసర సహాయ చర్యల్లో పాల్గొనడం.
సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో లబ్ధిదారులను గుర్తించడం.
ఎన్నికల విధులు, ప్రొటోకాల్ బాధ్యతలు నిర్వర్తించే వారికి సాయం అందించడం.
గ్రామ, క్లస్టర్, మండల స్థాయిలో శాఖల అఽధికారులతో సమన్వయంచేసుకోవడం.
సీసీఎల్‌ఏ లేదా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్లు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించడం.
ఈ వార్తలు కూడా చదవండి
Hyderabad Metro : అదిరిపోయే శుభవార్త చెప్పిన HYD మెట్రో.. రైళ్ల ప్రయాణ వేళలు పొడిగింపు..
GPO Posts: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
Sunny Yadav Betting App Case: బెట్టింగ్ యాప్స్ కేసు.. ఒక్కొక్కరికీ చుక్కలు చూపిస్తున్న పోలీసులు
Read Latest Telangana News And Telugu News
Updated Date - Mar 30 , 2025 | 01:20 AM