ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గ్రామ పంచాయతీ కార్మికుల పోరుబాట

ABN, Publish Date - Jan 02 , 2025 | 03:16 AM

గ్రామ పంచాయతీ కార్మికులు, సిబ్బంది తమ సమస్యల పరిష్కారం కోసం పోరుబాట పట్టనున్నారు. తమ జేఏసీతో చర్చలు జరపాలని డిసెంబరు 6న విన్నవించినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో శుక్ర, శనివారాల్లో టోకెన్‌ సమ్మె నిర్వహించారు.

  • 4వ తేదీ తరువాత నిరవధిక సమ్మెకు నిర్ణయం

  • మల్టీపర్పస్‌ విధానం రద్దు, పెండింగ్‌ వేతనాలే ప్రధాన డిమాండ్లు

  • కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వినతి

ఆసిఫాబాద్‌, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ కార్మికులు, సిబ్బంది తమ సమస్యల పరిష్కారం కోసం పోరుబాట పట్టనున్నారు. తమ జేఏసీతో చర్చలు జరపాలని డిసెంబరు 6న విన్నవించినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో శుక్ర, శనివారాల్లో టోకెన్‌ సమ్మె నిర్వహించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే జనవరి 4 తర్వాత నిరవధిక సమ్మెకు దిగనున్నారు. రాష్ట్రంలో 12,790 పంచాయతీల్లో సుమారు 50 వేల మంది గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారు. గ్రామాల్లో పారిశుధ్యం, మంచినీటి సరఫరా, వీధిలైట్లు, డంపింగ్‌ యార్డు, హరితహారం, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, కార్యాలయాల్లో క్యాటగిరీల వారీగా, డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. గత ప్రభుత్వం 2018లో జీవో నెం.51 జారీ చేసి సిబ్బంది వేతనాలను రూ.8,500కు పెంచుతూనే ఎవరైనా ఏ పనైనా చేయాలనే మల్టీపర్పస్‌ వర్కర్ల విధానం ప్రవేశపెట్టింది.


దీంతో కార్మికులపై పని భారం పెరిగింది. 2011 లెక్కల ప్రకారం ప్రతి 500 మంది జనాభాకు ఒక కార్మికుడు చొప్పున 36,500 మందిని ఖరారు చేసి ఆన్‌లైన్‌లో పేర్లు పొందుపర్చారు. అయితే 13 సంవత్సరాల్లో గ్రామ పంచాయతీల విస్తీర్ణంతోపాటు పారిశుధ్య అవసరాలు పెరగడంతో మరో 13,500 మంది కార్మికులను అదనంగా నియమించారు. అయితే వీరి పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడంతో వేతనాలు నిర్ణయించిన దానికంటే తక్కువ చెల్లిస్తున్నారు. అవీ ఐదారు నెలలుగా ఇవ్వకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ పంచాయతీ కార్మికులు, ఉద్యోగులు గత ఏడాది జూలైలో 30 రోజులకు పైగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఏడాది గడుస్తున్నా స్పందించకపోవడంతో జనవరి 4 నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నారు.


డిమాండ్లు ఇవే..

  • గ్రామ పంచాయతీ సిబ్బందికి పెండింగ్‌ వేతనాలు చెల్లించాలి. వేతనాలకు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాలి.

  • సిబ్బందిని రెండో పీఆర్సీ పరిధిలోకి తీసుకురావాలి. జీవో నెం.60 ప్రకారం క్యాటగిరీల వారీగా వేతనాలివ్వాలి.

  • జీవో నెం.51ను సవరించాలి. మల్టీపర్పస్‌ వర్కర్ల విధానాన్ని రద్దుచేయాలి. పాత క్యాటగిరీలను కొనసాగించాలి.

  • సిబ్బంది అందరినీ పర్మినెంట్‌ చేయాలి. వేతనాలు పెంచాలి. అర్హులకు పదోన్నతులు ఇవ్వాలి.

  • బీమా, ఈఎ్‌సఐ, పీఎఫ్‌ సౌకర్యం కల్పించాలి. రిటైర్మెంట్‌ సమయంలో రూ.5 లక్షలు చెల్లించాలి.

  • కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలి.

  • ఆన్‌లైన్‌లో నమోదు కాని కార్మికులకు కూడా వేతనాలు చెల్లించాలి. కార్మికుల సంఖ్య పెంచాలి.

  • కార్మికులు అందరికీ ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి. మృతిచెందిన, అనారోగ్యానికి గురైన కార్మిక కుటుంబాల సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలి.

Updated Date - Jan 02 , 2025 | 03:16 AM