Hyderabad: కన్నుల పండువగా శోభాయాత్ర భారీగా తరలివచ్చిన భక్తులు

ABN, Publish Date - Apr 07 , 2025 | 04:14 AM

శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్‌లోని ధూల్‌పేట నుంచి కోఠి హనుమాన్‌ వ్యాయామ్‌శాల వరకు నిర్వహించిన శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది.

Hyderabad: కన్నుల పండువగా శోభాయాత్ర భారీగా తరలివచ్చిన భక్తులు

అఫ్జల్‌గంజ్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్‌లోని ధూల్‌పేట నుంచి కోఠి హనుమాన్‌ వ్యాయామ్‌శాల వరకు నిర్వహించిన శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. తొలుత భాగ్యనగర్‌ శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సీతారాంబాగ్‌ ఆలయం వద్ద సీతారాముల కళ్యాణం మహోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కల్యాణ మహోత్సవానికి గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యాత్రను ప్రారంభించారు. గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ధూల్‌పేట ఆకాశపురి హనుమాన్‌ దేవాలయం వద్ద హనుమాన్‌ చాలీసా పఠనం చేసి శోభాయాత్రను ప్రారంభించారు.


ధూల్‌పేట నుంచిఆనంద్‌ సింగ్‌ ఏర్పాటు చేసిన సీతారాముల పల్లకి యాత్రను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రారంభించారు. ప్రధాని మోదీ నిజమైన భూములకు రక్షణ కల్పించడం కోసమే వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లు తీసుకొచ్చారని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ చెప్పారు. దేశం మొత్తం మోదీ, యోగీ వైపు చూస్తోందన్నారు. రామ మందిర నిర్మాణం జరగదని ఒవైసీ భావించారని కానీ మోదీ ప్రభుత్వం రామమందిర నిర్మాణం చేసి చూపిందని రాజా సింగ్‌ చెప్పారు. శోభాయాత్ర శాంతియుతంగా సాగేందుకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

HCU Land: హెచ్‌సీయూ వివాదంలో నిజాలు ప్రచారం చేయండి

No Exam: ఈ అర్హత చాలు.. పరీక్ష లేకుండా ఉద్యోగం.. నెలకు రూ. 2 లక్షల జీతం

Water Conflict: నీటి పంచాయతీ.. అధికారులతో ఉత్తమ్ కీలక భేటీ

Healthy Soup: ఈ సూప్‌తో మీ శరీరంలో కొన్ని భాగాలకు ఊహించని శక్తి పక్కా

Cotton Clothing: కాటన్ దుస్తులు.. ఒరిజినలా? కాదా? ఎలా గుర్తించాలంటే..

Fake Cardiologist: ఏడుగురి ఉసురు తీసిన వైద్యుడు.. విచారణకు రంగం సిద్ధం

శ్రీలీలకి చేదు అనుభవం.. చెయ్యి పట్టుకుని లాగిన యువకులు

కేసు No.62.. సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్ పై విచారణ

For Telangana News And Telugu News

Updated Date - Apr 07 , 2025 | 04:14 AM