Share News

Harish Rao: రేవంత్‌రెడ్డి తీరుతో అధికారులు జైలుకు: హరీశ్‌

ABN , Publish Date - Apr 14 , 2025 | 05:10 AM

హెచ్‌సీయూ భూముల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరుతో అధికారులు జైలుకు వెళ్లే అవకాశముందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.

Harish Rao: రేవంత్‌రెడ్డి తీరుతో అధికారులు జైలుకు: హరీశ్‌

గజ్వేల్‌/హైదరాబాద్‌, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): హెచ్‌సీయూ భూముల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరుతో అధికారులు జైలుకు వెళ్లే అవకాశముందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ పట్టణంలో బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సన్నాహక సమావేశాన్ని ఆదివారం నిర్వహించగా, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, బీఆర్‌ఎస్‌ గజ్వేల్‌ ఇన్‌చార్జి వంటేరు ప్రతా్‌పరెడ్డితో కలసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్బంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రేషన్‌ దుకాణాల్లో సన్నబియ్యంతో మరో డ్రామాకు తెర లేపారని, ప్రస్తుతం ఇస్తున్న సన్నబియ్యంలో 40% నూకలే ఉంటున్నాయని, నాణ్యమైన సన్నబియ్యాన్ని ప్రజలకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.


కాగా, ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదంలో చిక్కుకున్నవారిలో ఇద్దరి మృతదేహాలను వెలికితీసి చేతులు దులుపుకొన్నారని, సహాయక చర్యల పేరిట ఇంకెన్నిరోజులు కాలయాపన చేస్తారని ఎక్స్‌ వేదికగా హరీశ్‌ రావు ప్రశ్నించారు. కాగా, తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అంబేడ్కర్‌ను అవమానిస్తోందని బీఆర్‌ఎస్‌ నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్‌, మేడే రాజీవ్‌సాగర్‌ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో వారు మీడియాతో మాట్లాడుతూ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా సర్కార్‌ అవలంబిస్తున్న తీరును ఖండిస్తున్నామన్నారు.

Updated Date - Apr 14 , 2025 | 05:10 AM