Share News

Patancheru: భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త

ABN , Publish Date - Apr 15 , 2025 | 05:55 AM

పుట్టింటికి వెళ్లిన తన భార్యను తిరిగి కాపురానికి పంపకుండా పెద్ద మనుషుల మధ్య పంచాయితీ పెట్టించినందుకు ఆగ్రహానికి గురైన భర్త.. భార్యను రోకలిబండతో కొట్టి చంపేశాడు.

Patancheru: భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త

  • అడ్డొచ్చిన అత్తపైనా దాడి

పటాన్‌చెరు, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): పుట్టింటికి వెళ్లిన తన భార్యను తిరిగి కాపురానికి పంపకుండా పెద్ద మనుషుల మధ్య పంచాయితీ పెట్టించినందుకు ఆగ్రహానికి గురైన భర్త.. భార్యను రోకలిబండతో కొట్టి చంపేశాడు. అడ్డుపడిన అత్తపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పెద్దకంజర్లలో సోమవారం జరిగింది. పెద్దకంజర్లకు చెందిన రమీల (25)కు జిన్నారం మండలం కిష్టాయిపల్లికి చెందిన సురే్‌ష(30)తో అయిదేళ్ల క్రితం వివాహమయింది. ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండడంతో నెల క్రితం రమీల పుట్టింటికి వచ్చింది.


ఈ క్రమంలో సోమవారం గ్రామంలో పెద్దమనుషులు పంచాయితీ పెట్టేందుకు సిద్ధమయ్యి సురే్‌షకు సమాచారమిచ్చారు. భార్యను కాపురానికి పంపకుండా పంచాయితీ పెట్టించారని ఆగ్రహానికి గురైన సురేష్‌ సోమవారం అత్తగారింటికి చేరుకుని రోకలిబండతో భార్య తలపై విచాక్షరహితంగా దాడి చేశాడు. అడ్డుకున్న అత్త కవితపై కూడా దాడికి తెగబడ్డాడు. తీవ్ర గాయాలపాలైన రమీల అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Apr 15 , 2025 | 05:55 AM