Share News

Hyderabad: నీ తెలివి పాడుగాను.. కోళ్ల గంపలో పిల్లలను పెట్టి

ABN , Publish Date - Apr 16 , 2025 | 09:54 AM

కాస్త సృజనాత్మకంగా ఆలోచించే శక్తి ఉండాలే కానీ అద్భుతాలు సృష్టించవచ్చు. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం కనుక్కోవచ్చు. ఇందుకు నిదర్శనంగా నిలిచే సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..

Hyderabad: నీ తెలివి పాడుగాను.. కోళ్ల గంపలో పిల్లలను పెట్టి

హైదరాబాద్: ఉపాయం ఉన్నోడికి అపాయం రాదని పెద్దల మాట. అవును మరి సమస్య వస్తే.. కుంగిపోకుండా దాని నుంచి బయటపడే మార్గం ఆలోచిస్తే.. ఏదో ఒక ఐడియా తడుతుంది.. సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇందుకు ఉదాహరణగా నిలిచే సంఘటనలు నిత్యం అనేకం మన కళ్ల ముందే కనిపిస్తుంటాయి. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అది చూసిన నెటిజనులు.. వావ్ వాటే ఐడియా సర్‌జీ అని కామెంట్స్ చేస్తున్నారు. హ్యాపీ ఫ్యామిలీ అని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వివరాలు


టీవీఎస్ లూనా మీద మహా అయితే ముగ్గురు వెళ్లోచ్చు. అంతకంటే ఎక్కువ అంటే కుదరదు. కానీ ఈ వ్యక్తి ఐడియా చూస్తే.. ప్రతి ఒక్కరు ఆశ్చర్యంతో నోరు తెరవాల్సిందే. టీవీఎస్ లూనా మీద నలుగురు ప్రయాణం చేస్తున్నారు. అందులో వింతేముంది.. మన దేశంలో ఆరుగురు కూడా వెళ్తారు అంటారా.. అయితే ఆ నలుగురు ఎలా ప్రయాణం చేశారన్నది ఇక్కడ ముఖ్యం.

లూనా ఓనర్ బండి మీద.. ముందు ఒక పాపని కూర్చో బెట్టుకున్నాడు. తన వెనక ఇద్దరు చిన్న కుర్రవాళ్లను కూర్చోబెటుకున్నాడు. వారు కిందపడతారనే ఉద్దేశమో లేక స్పేస్ తక్కువుగా ఉందని ఆలోచించాడో తెలియదు కానీ.. కోళ్లను పెట్టే పంజరం ఉంటుంది కదా దాన్ని లూనాకు కట్టి.. ఇద్దరు పిల్లలను ఆరామ్ సే దానిలో కూర్చోబెట్టాడు. పిల్లలిద్దరూ చక్కగా ఒకరి పక్క ఒకరు కూర్చొని వారి రైడ్‌ను ఎంజాయ్ చేయసాగారు.


రోడ్డు మీద పోయే వాహనదారులు, నడుచుకుంటూ వెళ్లే వారు ఆ లూన్ ఓనర్ చేసిన పనికి ఆశ్చర్యపోతున్నారు. కొందరు వీడియో కూడా తీశారు. ఈ క్రమంలో ఇండియన్ ర్యాపర్ రోల్ రైడా తన ఇన్‌స్టాలో ఈ వీడియోని పోస్ట్ చేశాడు. ఈ సంఘటన నాగోల్, బండ్లగూడ ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. జస్ట్ కిడ్డింగ్ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల అవుతోంది. వావ్ వాటే ఐడియా.. గొప్ప ఆవిష్కరణ.. హ్యాపీ ఫ్యామిలీ.. 360 డిగ్రీస్ హెల్మెట్ అని కొందరు కామెంట్ చేయగా.. కొందరు మాత్రం ఓ కాకా వాళ్లు పిల్లలనుకున్నావా.. కోడీ పిల్లలనుకున్నావా.. అలా తీసుకెళ్తున్నావు.. జాగ్రత్తగా ఉండాలి కదా అని కామెంట్స్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

Arranged Marriages Check List: పెద్దలు కుదిర్చిన వివాహాలు..ఈ డాక్టర్ సూచనలతో నెట్టింట కలకలం

Couple Viral Video: మేడపై రీల్ చేస్తున్న భార్య.. వద్దంటూ గొడవకు దిగిన భర్త.. చివరకు జరిగిందేంటో చూస్తే..

Updated Date - Apr 16 , 2025 | 09:58 AM