ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: మహిళా ఉద్యోగులకు హైదరాబాద్‌ సేఫ్‌!

ABN, Publish Date - Jan 13 , 2025 | 04:00 AM

మహిళా ఉద్యోగులకు దేశంలోనే అత్యంత సురక్షితమైన నగరాల జాబితాలో హైదరాబాద్‌ మూడో స్థానంలో నిలిచింది. ఇక మహిళలకు వివిధ రంగాల్లో అత్యంత ప్రోత్సాహం లభిస్తున్న రాష్ట్రాల విషయానికొస్తే... తెలంగాణకు దేశంలోనే రెండో స్థానం దక్కింది.

  • రాష్ట్ర రాజధానికి దేశంలోనే మూడో స్థానం

హైదరాబాద్‌, జనవరి 12: మహిళా ఉద్యోగులకు దేశంలోనే అత్యంత సురక్షితమైన నగరాల జాబితాలో హైదరాబాద్‌ మూడో స్థానంలో నిలిచింది. ఇక మహిళలకు వివిధ రంగాల్లో అత్యంత ప్రోత్సాహం లభిస్తున్న రాష్ట్రాల విషయానికొస్తే... తెలంగాణకు దేశంలోనే రెండో స్థానం దక్కింది. అవతార్‌ గ్రూప్‌ అనే వర్క్‌ కల్చర్‌ కన్సల్టింగ్‌ సంస్థ 2024 ఫిబ్రవరి-నవంబరు మధ్యలో దేశంలోని 60 నగరాల్లో సర్వే చేసింది. దాని ఆధారంగా మహిళా ఉద్యోగులకు దేశంలోనే 25 అత్యుత్తమ నగరాల జాబితాను ప్రకటించింది. ఈ టాప్‌-25 నగరాలలో హైదరాబాద్‌కు నాలుగో స్థానం దక్కింది.


బెంగళూరు అగ్రస్థానంలో ఉండగా చెన్నై, ముంబై ఈ జాబితాలో హైదరాబాద్‌కంటే ముందు ఉన్నాయి. ఇక మహిళా భద్రత విషయానికి వచ్చే సరికి హైదరాబాద్‌కు మూడో స్థానం దక్కింది. ఈ జాబితాలో తిరువనంతపురం, ముంబై వరుసగా తొలి రెండుస్థానాల్లో నిలిచాయి. మరోపక్క, మహిళల నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పనలో గురుగ్రామ్‌ అగ్రస్థానంలో ఉండగా.. ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Updated Date - Jan 13 , 2025 | 04:00 AM