ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ACB: ఏసీబీ అధికారుల సమావేశం.. అందుకోసమేనా

ABN, Publish Date - Jan 07 , 2025 | 11:59 AM

Telangana: కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసిన నేపథ్యంలో తదుపరి చర్యలపై ఏసీబీ అధికారులు సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే గ్రీన్‌కో తో పాటు అనుబంధ మూడు కంపెనీలలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ACB officials

హైదరాబాద్, జనవరి 7: మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు (Telangana Highcourt) కొట్టివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు సమావేశమయ్యారు. మంగళవారం ఉదయం ఏసీబీ కార్యాలయంలో సమావేశం నిర్వహించిన అధికారులు... హైకోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చలు నిర్వహించారు. కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసిన నేపథ్యంలో తదుపరి చర్యలపై ఏసీబీ అధికారులు సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే గ్రీన్‌కో తో పాటు అనుబంధ మూడు కంపెనీలలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా.. కేటీఆర్‌కు హైకోర్టు గట్టి షాకిచ్చిందనే చెప్పుకోవాలి. ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్‌ వేసిన క్వాష్ పిటిషన్‌ను ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఏసీబీ కేసులో తాము జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం తేల్చి చెప్పేసింది. అయితే కేటీఆర్‌కు వ్యతిరేకంగా తీర్పు రావడంతో తర్వాత ఏం చేయాలనే దానిపై కేటీఆర్ వర్గం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.


హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టులో సవాల్ చేసే యోచనలో కేటీఆర్ ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు కూడా తర్వాత ఏంటి అనే దానిపై చర్చలు నిర్వహిస్తున్నారు. ఒకవేళ కేటీఆర్ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే.. ఎలాంటి స్టెప్ తీసుకోవాలనే దానిపై ఏసీబీ అధికారులు చర్చిస్తున్న పరిస్థితి. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా ఎత్తివేసిన నేపథ్యంలో కేటీఆర్‌ను ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. కేటీఆర్ విషయంలో ఏసీబీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అటు బీఆర్‌ఎస్‌ వర్గాల్లో కూడా కొంత ఆందోళన ఉన్నట్లు తెలుస్తోంది. కేటీఆర్‌కు వ్యతిరేకంగా హైకోర్టులో తీర్పు వచ్చిన నేపథ్యంలో నెక్ట్స్‌ ఏం జరుగబోతుంది?.. కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంటి? అనేదానిపై బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో గుబులు రేగుతున్నట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి...

Allu Arjun: ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను చూడగానే అల్లు అర్జున్‌ రియాక్షన్ ఇదే..

KTR: కాంగ్రెస్ అంటేనే కన్నింగ్.. కేటీఆర్ విసుర్లు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 07 , 2025 | 12:10 PM