Formula E Case: ఏసీబీ వరుస ప్రశ్నలు.. షాక్‌లో ఐఏఎస్
ABN, Publish Date - Jan 08 , 2025 | 01:55 PM
Telangana: ఫార్ములా ఈ కార్ రేసు కేసుకు సంబంధించి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను దాదాపు మూడు గంటలుగా ఏసీబీ ప్రశ్నిస్తోంది. ఫార్ములా ఈ కార్ రేసులో నిధుల మళ్లింపుకు సంబంధించే ఏసీబీ ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్, జనవరి 8: ఫార్ములా ఈ కార్ రేసు కేసు (Formula E Race Case) దర్యాప్తులో ఏసీబీ (ACB) దూకుడు పెంచింది. ఈ కేసులో నోటీసులు అందుకున్న అప్పటి పురపాలకశాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ ఈరోజు ఉదయం ఏసీబీ విచారణకు వచ్చారు. దాదాపు మూడు గంటలుగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను (IAS Officer Arvind kumar) ఏసీబీ ప్రశ్నిస్తోంది. ముగ్గురు ఏసీబీ అధికారుల బృందం.. అరవింద్ కుమార్‌ను విచారిస్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేసులో నిధుల మళ్లింపుకు సంబంధించే ఏసీబీ ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు తెలుస్తోంది. రూ.55 కోట్ల నిధులను విదేశీ కంపెనీకి హెచ్‌ఎండీఏ చెల్లించిన నేపథ్యంలో ఇదే విషయంపై ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. రూ.55 కోట్లు ఎఫ్‌ఈవో సంస్థకు చెల్లించిన నేపథ్యంలో విదేశీ కంపెనీకి నగదు బదిలీ వెనుక ఉన్న అసలు కోణం ఏంటి.. ఇది ఎవరి నిర్ణయం... నగదు బదిలీకి ఆర్బీఐ అనుమతి ఉందా అంటూ అరవింద్ కుమార్‌కు ఏసీబీ వరుస ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. అలాగే ఈ ప్రశ్నలకు అరవింద్ కుమార్ కూడా కీలక సమాచారం చెప్పినట్లు సమాచారం. కేటీఆర్ ఆదేశాలు ఇవ్వడంతోనే నగదు రిలీజ్ చేశామని అరవింద్ కుమార్ స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అరవింద్ కుమార్ చెబుతున్న స్టేట్‌మెంట్‌ను ఏసీబీ రికార్డు చేస్తోంది.
ఏసీబీ ప్రశ్నలివే..
55కోట్లు నిధుల విదేశీ అకౌంట్లు కు జమ చేయడం ఎవరి నిర్ణయం ?
ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా ఎందుకు నిధులు రిలీజ్ చేశారు ?
కేబినెట్ అప్రూవల్ లేకుండా నిధులు రిలీజ్ చేయవద్దని మీకు తెలియదా ?
కేటీఆర్ ఆదేశాలు ఇవ్వడంతోనే నగదు రిలీజ్ చేశామని అరవింద్ కుమార్ స్టేట్‌మెంట్ ఇచ్చారు
మంత్రిగా కేటీఆర్ ఆదేశాలు ఇచ్చినా .. ఆ రూల్స్‌ను ప్రజాప్రతినిధులకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా ?
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా .. బ్యాంక్ ఎలా నగదు బదిలీ చేసింది ?
హెచ్‌ఎండీఏ పరిధిని మించి నగదు బదిలీ చేసింది.. మౌఖిక ఆదేశాలు కేవలం కేటీఆర్ మాత్రమే ఇచ్చారా లేక ఇంకా ఎవరైనా ఉన్నారా ?
ఎఫ్‌ఈవోతో చేసుకున్న అగ్రిమెంట్ ఏంటి? అగ్రిమెంట్‌లోరాసుకున్న నిబంధనలు ఏంటి?
గ్రీన్ కో స్పాన్సర్ షిప్ నుంచి వైదొలగడానికి కారణం ఏంటి ?
ఒప్పందం ప్రకారం 2024 లో నిర్వహించాల్సిన రేస్ ఎందుకు నిర్వహించలేక పోయారు...?
హెచ్‌ఎండీఏ కార్ రేసింగ్ కోసం కాకుండా .. ఇంకా వేటికైనా నిధులు రిలీజ్ చేశారా ?
హెచ్‌ఎండీఏ నిర్ణయాల్లో చైర్మన్ పాత్ర ఏమైనా ఉంటుందా ? అంటూ ఇలా వరుసగా ప్రశ్నలు సంధించింది ఏసీబీ.
ఓవైపు ఏసీబీ కార్యాలయంలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను ఏసీబీ ప్రశ్నిస్తుండగా.. మరోవైపు ఈడీ కార్యాలయంలో హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎన్‌ఎల్ రెడ్డిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ప్రధానంగా ఈ కార్ రేసులో హెచ్ఎమ్‌డీఏ పాత్ర స్వల్పంగా ఉన్నప్పటికీ స్పాన్సర్స్ చెల్లించాల్సిన డబ్బును హెచ్‌ఎండీఏ ఎందుకు చెల్లించాల్సి వచ్చిందని బీఎన్‌ఎల్ రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
కుంభమేళాకు బయలుదేరిన శ్రీవారి కళ్యాణరథం
IT Raids: హన్సిత, అనిల్ కేస్.. తెలుగు రాష్ట్రాల్లో ఐటీ సోదాలు
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jan 08 , 2025 | 01:55 PM