ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Formula E Case: ఆ అవసరం లేదనుకున్నారా.. కేటీఆర్‌‌పై ఏసీబీ ప్రశ్నల వర్షం..

ABN, Publish Date - Jan 09 , 2025 | 12:40 PM

Telangana: ఫార్ములా ఈ కేసు రేసులో విచారణ సందర్భంగా పలు కీలక ప్రశ్నలను కేటీఆర్ ముందు ఉంచారు ఏసీబీ అధికారులు. హెచ్‌ఎండీఏ నిధుల దుర్వినియోగంపైనే వరుసగా ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ రేసులో రూ.55 కోట్లు విదేశీ కంపెనీకి మళ్లింపుపై కేటీఆర్‌ను అధికారులు ప్రశ్నిస్తున్నారు.

Formula E Race Case

హైదరాబాద్, జనవరి 9: ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ (Former minister KTR).. ఏసీబీ (ACB) విచారణను ఎదుర్కుంటున్నారు. ఈరోజు ఉదయం నందినగర్‌లోని నివాసం నుంచి ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ చేరుకున్నారు. ఆ తరువాత ఏసీబీ విచారణ మొదలైంది. కేటీఆర్‌ను ముగ్గురు ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అలాగే కేటీఆర్ వెంటనే లాయర్ రామచంద్రరావు ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. విచారణ సందర్భంగా పలు కీలక ప్రశ్నలను కేటీఆర్ ముందు ఉంచారు ఏసీబీ అధికారులు. హెచ్‌ఎండీఏ నిధుల దుర్వినియోగంపైనే వరుసగా ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ రేసులో రూ.55 కోట్లు విదేశీ కంపెనీకి మళ్లింపుపై కేటీఆర్‌ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆ నిధులను ఎందుకు మళ్లించారు.. నిబంధనలు పాటించారా.. నిధుల మళ్లింపుకు ఆర్థిక శాఖ పర్మిషన్ ఉందా అంటూ ఇలా వరుసగా కేటీఆర్‌పై ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది.


ప్రశ్నలు ఇవే..

  1. రూ. 55 కోట్లు విదేశీ కంపెనీకి ఎందుకు చెల్లించారు?

  2. ఇది నిబంధనలకు విరుద్దమని మీకు తెలియదా?

  3. ఆర్బీఐ పర్మిషన్ ఎందుకు తీసుకోలేదు?

  4. కేబినెట్ ఆమోదం లేకుండానే నిధులు మళ్లింపా?

  5. ఆర్థిక శాఖ పర్మిషన్ అవసరం లేదనుకున్నారా?

  6. అగ్రిమెంట్లు, చెల్లింపులన్నీ మీ ఆధ్వర్యంలోనే జరిగాయా?

  7. కేటీఆర్ ఆదేశాల మేరకే నగదు రిలీజ్ చేశామన్న అధికారులు చెపుతున్నారు మీ సమాధానం ఏంటి ?

  8. అసలు హైదరాబాద్‌లో ఫార్ములా రేస్ ప్రతిపాదన ఎవరిది ? ఈ ప్రతిపాదనను ఎవరు ఆమోదించారు ?

  9. హైదరాబాద్‌లోనే ఈ ఫార్ములా రేస్‌ను ఎందుకు నిర్వహించాలనుకున్నారు ?

  10. రేస్ నిర్వహించడం వలన ప్రభుత్వానికి ఏమైనా ప్రయోజనం లభించిందా?

  11. ఎఫ్‌ఈవో కంపనీకే ఎందుకు ఈ రేస్ నిర్వహణ బాధ్యతలు ఇచ్చారు?

  12. కేటీఆర్ , మీకు అధికారులు నగదు బదిలీ చేస్తే ఇబ్బందులు వస్తాయని హెచ్చరించారా ?

  13. నగదు బదిలీ అనే అంశం నిబంధనలకు విరుద్ధం అనేది మీ అధికారులు మీ దృష్టికి తీసుకొచ్చారా ?

  14. నిబంధనలు విరుద్దంగా నగదు బదిలీ చేస్తే భవిష్యత్‌లో ఇబ్బందులు వస్తాయని అధికారులు మీకు చెప్పారా ? హెచ్చరించారా ?

  15. నిబంధనలు పట్టుంచుకోకుండా 55 కోట్లు నగదు ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చింది ?

  16. నగదు బదిలీ చేసే సమయంలో రూల్స్ బ్రేక్ చేయమని మీరే చెప్పారా ?

  17. అరవింద్ కుమార్ మాత్రం మీ ఆదేశాలతో నగదు బదిలీ చేశామని వాంగ్మూలం ఇచ్చారు. దీనికి మీ సమాధానం ఏంటి ?

  18. గ్రీన్ కో కంపనీ స్పాన్సర్ షిప్ నుంచి వైదొలిగింది ?

  19. స్పాన్సర్ షిప్‌లో ఉన్న కంపనీ మీకు ఎలక్ట్రోల్ బాండ్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ?

  20. ఈ స్పాన్సర్ షిప్ ద్వారా ఆ కంపినీకి ప్రయోజనం చేకూరిందా ?

  21. మీపై మోపిన అభియోగాలు పై మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు ?

  22. నగదు బదిలీ అంశం కేబినెట్ దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు ? కేబినెట్ నుంచి అనుమతులు లేకుండా ఎలా బదిలీ చేస్తారు ?

  23. బదిలీ అయిన నగదు తిరిగి హెచ్‌ఎండీఏ ఖాతాకు వచ్చిందా లేదా ? మీకు సమాచారం ఏమైనా ఉందా ? అంటూ వరుసగా ఏసీబీ ప్రశ్నలు సంధించింది.


ఈడీ విచారణకు అరవింద్‌

మరోవైపు ఫార్ములా ఈ కేసులో అటు ఏసీబీ.. ఇటు ఈడీ అధికారులు దూకుడు పెంచారు. ఓ వైపు కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తుండగా.. ఈ కేసులో ఏ2 గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. కాసేపటి క్రితమే ఈడీ విచారణకు అరవింద్ కుమార్ హాజరయ్యారు. నిన్న ఏసీబీ విచారణను అరవింద్ కుమార్ ఎదుర్కున్న విషయం తెలిసిందే. దాదాపు ఆరు గంటల పాటు ఐఏఎస్‌ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఆయన నుంచి పలు కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అరవింద్ కుమార్, దాన కిషోర్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగానే కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి...

KTR: అవసరమైతే చచ్చిపోతా.. కేటీఆర్ సంచలన కామెంట్స్

Supreme Court: సుప్రీంలో కేటీఆర్‌కు దక్కని ఊరట

Read Latest Telangana News And Telugu news

Updated Date - Jan 09 , 2025 | 01:14 PM