Sankranti: సంక్రాంతి పండుగ వేళ.. ఆ బస్సులపై అధికారుల నిఘా
ABN, Publish Date - Jan 11 , 2025 | 10:56 AM
Telangana: తెలంగాణలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలు పాటించని బస్సులపై కొరడా ఝులిపిస్తున్నారు. మూడురోజులగా రవాణా శాఖ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి.
రంగారెడ్డి: తెలంగాణలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలు పాటించని బస్సులపై కొరడా ఝులిపిస్తున్నారు. మూడురోజులగా రవాణా శాఖ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. నిబంధనలు పాటించని బస్సులను సీజ్ చేశారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఉప రవాణా శాఖ అధికారి సదానందం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై మూడో రోజులుగా దాడులు కొనసాగిస్తున్నామని అన్నారు. జనవరి 20వ తేదీ వరకు ఈ దాడులు జరుగుతాయని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 150 ప్రైవేట్ బస్సులపై కేసు నమోదు చేశామని... 15 బస్సులు సీజ్ చేశామని ప్రకటించారు. రాజేంద్రనగర్ ఆరంఘర్ చౌరస్తా వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీలు చేస్తున్నామని చెప్పారు.
ఇప్పటివరకు 11 బస్సులపై కేసు నమోదు చేశామని.. ఓ ట్రావెల్స్ బస్సు సీజ్ చేశామని అన్నారు. ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్న వాటిపైనే దృష్టి పెట్టామని అన్నారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదని అన్నారు. బస్సు కండిషన్, పర్మిట్, ప్రయాణికుల అసౌకర్యం పైన తనిఖీలో దృష్టి పెట్టామని అన్నారు. చెన్నై, తిరువంతపురం, పాండిచ్చేరి, మంగళూరు, మైసూరు, కన్యాకుమారి బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులను తనిఖీలు చేస్తున్నామని వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని రవాణా శాఖ అధికారి సదానందం హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Harish Rao: టికెట్ రేట్ల పెంపు ఎవరి కోసం..!
High Court: బెనిఫిట్ షోలు రద్దంటూ.. స్పెషల్ షోకు అనుమతులా?
Read Latest Telangana News and Telangana News
Updated Date - Jan 11 , 2025 | 12:00 PM