Share News

Hyderabad: యువకుడిని తరిమిన ట్రాఫిక్ పోలీసులు.. చివరికి ఏమైందంటే..

ABN , Publish Date - Apr 13 , 2025 | 03:02 PM

హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులను చూసిన ద్విచక్ర వాహనదారుడు పారిపోయేందుకు యత్నించాడు. పోలీసులు అతని వెంటపడడంతో వేగం పెంచాడు.

Hyderabad: యువకుడిని తరిమిన ట్రాఫిక్ పోలీసులు.. చివరికి ఏమైందంటే..
Hyderabad Traffic Police

హైదరాబాద్: బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ట్రాఫిక్ పోలీసుల కారణంగా ఓ నిండు ప్రాణం బలైపోయింది. బాలానగర్ డిమార్ట్ వద్ద ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్నారు. అయితే అదే సమయంలో ద్విచక్రవాహనంపై వస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు ఆపారు. వాహనం తనిఖీ చేసేందుకు ప్రయత్నించగా.. భయపడిపోయిన సదరు యువకుడు పారిపోయేందుకు యత్నించాడు.


అతను పారిపోవడంతో ఏదో తప్పు చేసి ఉంటాడని అనుమానించిన పోలీసులు యువకుడి వెంట పడ్డారు. తనను పోలీసులు తమురుతున్నారని గ్రహించిన అతను మరింత వేగం పెంచాడు. దీంతో అదుపుతప్పి జీడిమెట్ల- బాలాపూర్ బస్సు కింద పడిపోయాడు. బస్సు అతని పైనుంచి వెళ్లడంతో తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కాగా, మృతుడు ఎవరు, పోలీసుల చూసి ఎందుకు పారిపోయాడనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి:

Mega Draw: ఖమ్మం వాసికి మారుతి స్విఫ్ట్‌ కారు

West Bengal Waqf protests: వక్ఫ్ విధ్వంసం.. ముగ్గురు మృతి.. 150 మంది అరెస్ట్

Updated Date - Apr 13 , 2025 | 03:16 PM