Crime News: హయత్‌నగర్‌లో వ్యక్తి మృతదేహం లభ్యం...
ABN , Publish Date - Apr 09 , 2025 | 11:20 AM
నగేష్ భార్య శిరీష నిన్న ఆత్మహత్య చేసుకుంది. భార్య సూసైడ్ చేసుకోవడంతో భర్త నగేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసుల అదుపులో ఉన్న నగేష్‌ను బంధువులు మంగళవారం రాత్రి జామీను మీద బయటికి తీసుకొచ్చారు. అయితే..

హైదరాబాద్: నగరంలోని హయత్ నగర్ (Hayathnagar)లో దారుణం చోటు చేసుకుంది. రిలయన్స్ డిజిటల్ షో రూమ్ దగ్గర రక్తం మడుగులో పడి ఉన్న వ్యక్తి మృతదేహం (Dead Body) లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు (Police) సంఘటన ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. హయత్‌నగర్ ముద్దిరాజ్ కాలనీకి చెందిన నగేష్ (Nagesh)గా గుర్తించారు. నగేష్‌ను హత్య చేసి మృతదేహాన్ని పడేశారా... లేదా అక్కడే హత్య చేశారా .. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడి తలకు, చేతులకు, కాళ్లకు కత్తి గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు మృతదేహాన్ని తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు క్లూస్ టీమ్‌తో దర్యాప్తు చేస్తున్నారు.
Also Read..: గుంటూరు అవతలవారిని నరికేస్తాం.. ఇవతలవారిని లాక్కొచ్చి కొడతాం
కాగా నగేష్ భార్య శిరీష నిన్న ఆత్మహత్య చేసుకుంది. భార్య సూసైడ్ చేసుకోవడంతో భర్త నగేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసుల అదుపులో ఉన్న నగేష్‌ను బంధువులు మంగళవారం రాత్రి జామీను మీద బయటికి తీసుకొచ్చారు. అయితే శిరీష ఆత్మహత్యతో నగేష్‌పై ఆగ్రహంతో మృతిరాలి బంధువులు హత్య చేశారా.. లేక భార్య ఆత్మహత్యతో నగేష్ ఆత్మహత్యా చేసుకున్నాడా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చంద్రబాబు కొత్త ఇంటి నిర్మాణానికి భూమి పూజ..
సిట్ విచారణకు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి
సింగపూర్ బయల్దేరిన చిరంజీవి దంపతులు ..
For More AP News and Telugu News