ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BRS.. దివ్యంగుడైన ఓ మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదు: కేటీఆర్

ABN, Publish Date - Jan 22 , 2025 | 09:25 AM

రాష్ట్రంలో పేరుకే ప్రజాపాలన ఉంది.. కానీ దివ్యంగుడైన ఒక మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదని.. బీఆర్ఎస్ పార్టీకి భయపడి నల్గొండ రైతు మహాధర్నాకు అనుమతి ఇవ్వకుండా, ఫ్లెక్సీలు చింపి, ఏకంగా ఒక ప్రభుత్వ ఆఫీసులో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గూండాలు మాజీ ఎమ్మెల్యేను బూతులు తిడుతూ పోలీసుల ముందే దాడికి పాల్పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి మండిపడ్డారు.

BRS Leader BRS

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President), మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (Ex Minister KTR) కాంగ్రెస్ ప్రభుత్వం Congress Govt) పై సోషల్ మీడియా ఎక్స్ (Social Media X) వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు (Comments) గుప్పించారు. పేరుకే ప్రజాపాలన.. కానీ దివ్యంగుడైన ఒక మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదని.. బీఆర్ఎస్ పార్టీకి భయపడి నల్గొండ రైతు మహాధర్నాకు అనుమతి ఇవ్వకుండా, ఫ్లెక్సీలు చింపి, ఏకంగా ఒక ప్రభుత్వ ఆఫీసులో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గూండాలు మాజీ ఎమ్మెల్యేను బూతులు తిడుతూ పోలీసుల ముందే దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. పోలీసుల ముందే దాడి చేసింది మంత్రి గూండాలు అయితే.. తిరిగి పోలీసులు మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారన్నారు. దాడి చేసిన వారి మీద మాత్రం ఎలాంటి చర్యలు లేవని.. ఇదీ కాంగ్రెస్ అరాచక పాలన తీరని దుయ్యబట్టారు. తమ నాయకుడు కంచర్ల భూపాల్ రెడ్డి మీద జరిగిన ఈ పాశవిక దాడిని ఖండిస్తున్నానని.. బాధ్యులపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేయవలసిందిగా రాష్ట్ర డీజీపీని కోరుతున్నానని కేటీఆర్ అన్నారు.

ఈ వార్త కూడా చదవండి..

రెండోరోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు


కాంగ్రెస్ హయాంలో క్రైమ్ సిటీగా హైదరాబాద్

కాగా కాంగ్రెస్‌ నిర్లక్ష్యపు పాలనతో హైదరాబాద్‌ సుడిగుండంలో చిక్కుకుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. సేఫ్‌ సిటీ.. కాస్తా క్రైమ్‌ సిటీగా మారిందని ఆరోపించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తలసాని నివాసంలో కేటీఆర్‌ మంగళవారం సమావేశమయ్యారు. నగరంల్లో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. కేటీఆర్‌ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ హయాంలో కంచెలు వేసి కాపాడిన ప్రభుత్వ పార్కులకు కాంగ్రెస్‌ పాలనలో రక్షణ లేకుండా పోయిందని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి పాలన చేతకాదనే నిజాన్ని హైదరాబాద్‌ వాసులు అర్థం చేసుకున్నారని చెప్పారు. కేసీఆర్‌ హయాంలో నిర్మించిన కట్టడాలు, నిర్మాణాల నిర్వహణ కూడా కాంగ్రెస్‌ సర్కారుకు చేతకావడం లేదన్నారు.

ఈ ప్రభుత్వానికి హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ కాపాడాలన్న సోయి లేకపోవడం దురదృష్టకరమని కేటీఆర్ వాపోయారు. కాంగ్రెస్‌ నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీ కూడా హైదరాబాద్‌లో అమలుకావడం లేదని ఆరోపించారు. గ్రామసభలు, వార్డు సభల పేరిట సర్కారు ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. హైదరాబాద్‌ అభివృద్ధిని గాలికొదిలేసిన సర్కారుకు నగర ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సిఐడి మాజీ చీఫ్ అధికార దుర్వినియోగంపై విచారణ..

విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు గిరిజనుల మృతి

బొత్సకు ఆ విషయం కూడా తెలియదా..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 22 , 2025 | 09:33 AM