CM Revanth Reddy: రాహుల్‌‌గాంధీ ఆదేశాలతోనే ఎస్సీ వర్గీకరణ.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Mar 19 , 2025 | 02:30 PM

CM Revanth Reddy: వర్గీకరణపై సుప్రీంకోర్టులో బలంగా తమ ప్రభుత్వం వాదన వినిపించడంతోనే సాధ్యమైందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ వర్గీకరణ జరగలేదు.. మందకృష్ణ ఈ విషయం గుర్తించుకోవాలని అన్నారు.

CM Revanth Reddy: రాహుల్‌‌గాంధీ ఆదేశాలతోనే ఎస్సీ వర్గీకరణ.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy

హైదరాబాద్: ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆదేశాలతోనే తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. వర్గీకరణ.. మాదిగల న్యాయమైన హక్కు అని తెలిపారు. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో వర్గీకరణ కోసం అధ్యయనం చేశామని అన్నారు. ఇవాళ(బుధవారం) ఎస్సీ సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ చేసినందుకు కాంగ్రెస్, రాహుల్ గాంధీలను మాదిగలు అభినందించాలని చెప్పారు. భవిష్యత్‌లో న్యాయపరమైన చిక్కులు రాకుండా.. వన్‌మెన్ కమిషన్ వేశామని గుర్తుచేశారు. 199 పేజీలతో ఓ నివేదికను కమిషన్ ఇచ్చిందని అన్నారు. ఎస్సీలను మూడు గ్రూపులుగా విభజించారని తెలిపారు. వర్గీకరణ..ఎవరికీ వ్యతిరేకం కాదు.. మాదిగలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.


జెడ్పీటిషన్ నుంచి సీఎం వరకు.. మాదిగలు అభిమానించారు.. ఆదరించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. గతంలో వర్గీకరణపై తాను అసెంబ్లీలో ప్రశ్నిస్తే.. తనను సభ నుంచి బయటకు పంపించారని గుర్తుచేశారు. వర్గీకరణపై సుప్రీంకోర్టులో బలంగా తమ ప్రభుత్వం వాదన వినిపించడంతోనే సాధ్యమైందని ఉద్ఘాటించారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తనకు మంచి మిత్రుడని..ఆయన అంటే తనకు ఎంతో అభిమానమని తెలిపారు. మంద కృష్ణకు తనపై కంటే కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిలపై అభిమానం పెంచుకున్నారని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ వర్గీకరణ జరగలేదు.. మందకృష్ణ ఈ విషయం గుర్తించుకోవాలని అన్నారు. వర్గీకరణ తేల్చేవరకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.


మాదిగ బిడ్డను ఓయూకు, బాసర ఐఐటీకి వీసీలుగా తాము నియమించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. ఏది ఏమైనా సరే అనే తమ ప్రభుత్వం వర్గీకరణ చేసిందని చెప్పారు. అవకాశం వచ్చిన దానిని మీరు ఉపయోగించుకోండి. పది మందికి సహాయం చేసేలా పనిచేయాలని సూచించారు. అప్పుడే మరో పదిమందికి అవకాశాలు వస్తాయన్నారు. తాను సీఎంగా ఉన్నంత వరకు మీవాడే ఉన్నారనుకోవాలని చెప్పారు. తాను కేవలం పేరు మాత్రమే కోరుకుంటానని తెలిపారు. ఈ ప్రభుత్వం మీదే.. మీ సంక్షేమం, అభివృద్ధికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పిల్లలను బాగా చదివించండి.. ప్రభుత్వం అండగా ఉంటుందని మాటిచ్చారు. రాహుల్‌గాంధీ కోసం ఒక భారీ బహిరంగ సభ పెట్టాలని కోరారు. విజయోత్సవ సభ పెట్టండి..అభినందనలు చెప్పాలని అన్నారు. గాంధీ కుటుంబం మీ నుంచి కోరుకునేది అభినందనలు మాత్రమేనని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

KTR on Budget 2025: తొండ ముదిరితే ఊసరవెల్లి.. ఊసరవెల్లి ముదిరితే రేవంత్ రెడ్డి: కేటీఆర్..

Telangana Budget 2025: ఇదీ తెలంగాణ బడ్జెట్.. ఏయే శాఖలకు ఎంత కేటాయించారంటే..

Telangana Budget 2025-26: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి భట్టి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 19 , 2025 | 02:41 PM