Cyber Crime: ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టను రట్టు చేసిన పోలీసులు

ABN, Publish Date - Jan 29 , 2025 | 05:23 PM

Cyber Crime: సైబర్ క్రైమ్‌లో నగదు రికవరీ కావడం చాలా కష్టమని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీ వీ ఆనంద్ స్పష్టం చేశారు. అందుకే ఈ మోసాలపై అవగాహనం చాలా ముఖ్యమన్నారు. నిందితులు ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందిన వ్యక్తులు కావడంతో.. ఈ కేసులు దర్యాప్తు చేయడం చాలా కష్టతరంగా మారుతోందని తెలిపారు.

Cyber Crime: ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టను రట్టు చేసిన పోలీసులు
HYD CP CV Anand

హైదరాబాద్, జనవరి 29: అమాయకులను టార్గెట్ చేసుకుని ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు రట్టు చేశారు. అందుకు సంబంధించి ఎనిమిది రాష్ట్రాల్లో ఈ ఆపరేషన్ జరిగిందని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌లో సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా మొత్తం 576 కేసులు నమోదు కాగా.. వాటిలో తెలంగాణలో 74 కేసులు.. హైదరాబాద్‌లో 33 కేసులు నమోదు అయినట్లు వివరించారు. ఈ ఆన్‌లైన్ మోసాల కారణంగా.. రూ. 88.3 కోట్ల మేర బాధితులకు నష్టం వాటిల్లిందని చెప్పారు. అయితే ఈ కేసుల్లో మొత్తం రూ. 2.87 కోట్లు ఫ్రీజ్ చేశామని వెల్లడించారు. ఈ కేసులో ముగ్గురు కీలక సూత్రదారులు ఉన్నారన్నారు.

ముంబైకి చెందిన చెందిన జూనైద్ నగదును.. క్రిప్టో కరెన్సికి మారుస్తున్నాడని వివరించారు. ఆ క్రమంలో డిజిటల్ అరెస్ట్ కేసులో ఇద్దరు వైద్యులు మోసపోయారని విశదీకరించారు. చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు పేరుతో ఫేక్ ఆర్డర్ తయారు చేశారన్నారు. అలాగే మీ కేసు క్లోజ్ చేస్తాం నగదు డిపాజిట్ చేయాలని డిమాండ్ చేయడంతో.. మూడు కోట్ల ఎఫ్‌డీలను నిందితులకు చెల్లించారని తెలిపారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఇక ఈ వ్యవహారంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సైతం సమావేశం నిర్వహించామన్నారు.

Also Read: పంచగ్రామాల ప్రజలకు గుడ్ న్యూస్


ఈ సమావేశానికి అన్ని బ్యాంకులకు సంబంధించిన ఉన్నతాధికారులు సైతం హాజరయ్యారని వివరించారు. అయితే సైబర్ క్రైం అరికట్టడంలో కీలక పాత్ర పోషించాలని బ్యాంకు ఆధికారులకు ఆయన సూచించారు. దీనిపై ఓ కమిటీ ఏర్పాటు చేశామని.. ఆ నివేదిక అందజేసిన వెంటనే చర్యలు చేపడతామని సీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. ఇక నిందితులు మూడు రకాల సైబర్ క్రైమ్‌కు పాల్పడ్డారని వివరించారు. ఇందులో 52 మంది నిందితులతు ప్రమేయం ఉందన్నారు. అలాగే ముగ్గురు బ్యాంక్ ఉద్యోగులను సైతం అరెస్ట్ చేశామని చెప్పారు. ఫేస్ బుక్ బ్రౌజింగ్‌తోపాటు వాట్సప్ గ్రూప్ ద్వారా నిందితులు ఆకర్షిస్తున్నారన్నారు.

Also Read: జాతీయ క్రీడల జరుగుతోన్న వేళ.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు


ఓ వ్యక్తిని లక్ష్యంగా చేసుకొని రూ. 93 లక్షల ట్రేడింగ్ ఫ్రాడ్ చేశారన్నారు. మరో బాధితుడు అయితే.. రూ. 2.06 లక్షల మేర విడతల వారీగా నగదు కోల్పోయాడన్నారు. అనీషా యాప్ ద్వారా వాట్సప్ గ్రూప్‌లో ఇన్వెస్ట్ చేసి మోసపోయాడరన్నారు. మ్యూల్ అకౌంట్ ఓపెన్ చేసి.. బ్యాంకు అధికారుల సహకారంతో ఫ్రాడ్ చేస్తున్నారని చప్పారు. గుర్తు తెలియని యాప్స్, గ్రూప్స్‌లో చేరవద్దంటూ ప్రజలకు సీవీ ఆనంద్ సూచించారు. ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్‌తో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు ఆయన విజ్జప్తి చేశారు. ఇక సైబర్ క్రైం విషయంలో అవగాన చాలా ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.

Also Read: హైకోర్టు తీర్పుపై స్పందించిన జ్యోతి సురేఖ


ఎడ్యుకేటేడ్ వ్యక్తులు సైతం మోసపోతున్నారని చెప్పారు. గతేడాది రూ. 3, 500 కోట్లు సైబర్ క్రైమ్ ద్వారా మోసం జరిగిందని వివరించారు. అయితే ఈ కేసుల్లో కేవలం 13 శాతం మేరకే రికవరీ అయిందన్నారు. సైబర్ క్రైమ్‌లో నగదు రికవరీ కావడం చాలా కష్టమనన్నారు. అయితే ఈ మోసాలపై అవగాహనం చాలా ముఖ్యమన్నారు. నిందితులు ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందిన వ్యక్తులు కావడంతో.. ఈ కేసులు దర్యాప్తు చేయడం చాలా కష్టతరంగా మారుతోందన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు.

For Telangana News And Telugu News

Updated Date - Jan 29 , 2025 | 05:25 PM