Formula E Case: ఈడీ విచారణకు కేటీఆర్
ABN, Publish Date - Jan 16 , 2025 | 10:49 AM
KTR: ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు కేటీఆర్. ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే కేటీఆర్ ఒక్కరిని మాత్రమే ఈడీ అనుమతించింది. కేటీఆర్ లీగల్ టీంకు అనుమతి లేదని ఈడీ తేల్చిచెప్పేసింది.
హైదరాబాద్, జనవరి 16: మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) ఈడీ ఆఫీస్‌కు (ED Office) చేరుకున్నారు. గురువారం ఉదయం గండిపేట ఫాంహౌస్ నుంచి ఈడీ ఆఫీస్‌కు మాజీ మంత్రి వచ్చారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు కేటీఆర్. ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. హెచ్‌ఎండీఏ ఖాతా నుంచి విదేశీ సంస్థకు నిధుల బదిలీపై విచారణ చేయనున్నారు. విదేశీ సంస్థకు రూ.45.7కోట్ల బదిలీపై ఈడీ విచారించనుంది. ఫెమా నిబంధనలు ఉల్లఘించినట్లు గుర్తించిన ఈడీ.. మనీలాండరింగ్ కోణంలో విచారణ జరుపనుంది. అయితే కేటీఆర్ ఒక్కరిని మాత్రమే ఈడీ అనుమతించింది. కేటీఆర్ లీగల్ టీంకు అనుమతి లేదని ఈడీ తేల్చిచెప్పేసింది. బషీర్‌బాగ్ ఈడీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ స్టేట్‌మెంట్‌ను ఈడీ అధికారులు రికార్డ్ చేయనున్నారు.
ఈ కేసులో ఈనెల 9న కేటీఆర్‌ను ఏసీబీ సుదీర్ఘంగా విచారించిన విషయం తెలిసిందే. మరోవైపు సుప్రీంకోర్టు విచారణకు నిరాకరించటంతో పిటీషన్‌ను కేటీఆర్ ఉపసంహరించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఈడీ విచారణపై బీఆర్ఎస్ వర్గాల్లో టెన్షన్ నెలకొంది. ఇప్పటికే ఫార్ములా ఈ రేసు కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా కేటీఆర్‌కు ఈడీ ప్రశ్నలు సంధించనుంది.
హైటెన్షన్ వాతావరణం...
మరోవైపు ఈడీ కార్యాలయం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఈడీ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్ నేతలు చేరుకున్నారు. బీఆర్ఎస్ నేతల వాహనాలను ఈడీ కార్యాలయం వద్దకు పోలీసులు అనుమతించలేదు. గన్ పార్క్ వద్దనే గులాబీ శ్రేణుల వాహనాలను నిలిపివేశారు. దీంతో గన్ పార్క్ నుంచి ఈడీ కార్యాలయం వద్దకు నేతలు కాలినడకన వెళ్లారు. కాగా.. ఈడీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇక్కడి నుంచి నేతలను వెనక్కి వెళ్లిపోవాలి అని సూచిస్తున్నారు.
పోలీసుల అలర్ట్..
కాగా.. భారీగా బీఆర్ఎస్ నేతలు ఈడీ కార్యాలయం వద్దకు చేరుకుంటున్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. వారు ఆందోళన చేసే అవకాశం ఉండటంతో పది ప్లటూన్లుకు చెందిన సుమారు 200 మంది పోలీసులు ఈడీ కార్యాలయం వద్ద మోహరించారు. బందోబస్తు విధుల్లో 3 ఏసీపీలు, 8 మంది ఇన్స్పెక్టర్లు, 16 మంది ఎస్సైలు ఉన్నారు. భాస్ప వాయు గోళాలు ప్రయోగించే తుపాకులతో పోలీసులు మోహరించారు. రోప్ పార్టీ పోలీసులతో పాటు వజ్ర వాహనాన్ని కూడా పోలీసులు సిద్ధంగా ఉంచారు. ఈడీ కార్యాలయం పరిసరాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి...
Chinese manja: నిషేధమున్నా జోరుగా విక్రయాలు..
Trains: దక్షిణమధ్యరైల్వే పరిధిలో 4 రైళ్ల దారి మళ్లింపు
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jan 16 , 2025 | 03:28 PM