ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: ‘నా మాట గుర్తుంచుకో’.. కేటీఆర్ సంచలన ట్వీట్..

ABN, Publish Date - Jan 07 , 2025 | 03:27 PM

Telangana: ఫార్మాలు ఈ కేసుకు సంబంధించి తాజా పరిణామాలపై మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికరంగా ట్వీట్ చేశారు. నా పునరాగమనం ఎదురుదెబ్బ కంటే బలంగా ఉంటోంది. అబద్ధాలు నన్ను విచ్ఛిన్నం చేయవు. నీ మాటలు నన్ను తగ్గించవు’’ అంటూ ట్వీట్ చేశారు.

Former minister KTR

హైదరాబాద్, జనవరి 7: ఫార్ములా ఈ కేసుకు సంబంధించి ఏసీబీ కేసుపై కేటీఆర్‌ (Former Minister KTR) వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు (Telangana Highcourt) కొట్టివేయడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా ఎత్తివేయడంతో ఏ క్షణమైనా కేటీఆర్‌ అరెస్ట్ పక్కా అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై ఎక్స్‌ వేదికగా మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ ఎదురు దెబ్బల నుంచి బలంగా పుంజుకుంటామని అన్నారు. అబద్దాలు తనను దెబ్బతీయలేవన్నారు. కుట్రలతో తన నోరు మూయించలేరని.. ఇవాల్టి అడ్డంకులే రేపటి విజయానికి సోపానాలు అని ట్వీట్ చేశారు కేటీఆర్. న్యాయం కోసం పోరాటం సాగిస్తామని.. త్వరలోనే ప్రపంచానికి వాస్తవాలు తెలుస్తాయని మాజీ మంత్రి అన్నారు.


‘‘నా పునరాగమనం ఎదురుదెబ్బ కంటే బలంగా ఉంటోంది. అబద్ధాలు నన్ను విచ్ఛిన్నం చేయవు. నీ మాటలు నన్ను తగ్గించవు. మీ చర్యలు నా దృష్టిని మరుగుపరచవు. కోపోద్రిక్తత నన్ను నిశ్శబ్దం చేయదు! నేటి అడ్డంకులు రేపటి విజయానికి దారి తీస్తాయి.. సత్యం కాలంతో పాటు ప్రకాశిస్తుంది! నాకు మన న్యాయవ్యవస్థపై గౌరవం ఉంది. న్యాయం గెలుస్తుందని నా అచంచలమైన నమ్మకం. సత్యం కోసం నా పోరాటం కొనసాగుతుంది, త్వరలో ప్రపంచం కూడా దానికి సాక్ష్యమివ్వనుంది’’ అంటూ ఎక్స్‌లో కేటీఆర్ పోస్టు చేశారు. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ ఆసక్తికరంగా మారింది. జైలుకు వెళ్ళటానికి కేటీఆర్ మానసికంగా సిద్ధమయ్యారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


కాగా.. ఫార్ములా ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పు అనంతరం వేగంగా పరిణామాలు మారిపోయాయి. హైకోర్టు తీర్పుపై ఓవైపు బీఆర్‌ఎస్ వర్గాల్లో ఆందోళన నెలకొంది. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో కేటీఆర్ ఉన్నట్లు సమాచారం. మరోవైపు సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం కీలక పిటిషన్‌ను దాఖలు చేసింది. తమ వాదనలు వినకుండా కేటీఆర్ పిటీషన్‌పై ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దంటూ సర్కార్ కేవియట్ దాఖలు చేసింది. దీంతో కేటీఆర్ సుప్రీం కోర్టును ఆశ్రయించినప్పటికీ వెంటనే మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. తెలంగాణ ప్రభుత్వ వాదనలు విన్న తర్వాతే సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి కేటీఆర్‌కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 16న విచారణకు రావాల్సిందిగా ఈడీ నోటీసుల్లో పేర్కొంది. ఈ క్రమంలో ఈడీ విచారణకు కేటీఆర్ హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. అటు హైకోర్టు తీర్పు తర్వాత ఏసీబీ అధికారులు సమావేశమయ్యారు. తీర్పు నేపథ్యంలో తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై అధికారులు చర్చించారు. సర్చ్ వారెంట్ కోసం కోర్టు నుంచి ఏసీబీ అనుమతి పొందింది. కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిపై సోదాలకు కోర్టు సర్చ్ వారెంట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఏ క్షణంలోనైనా కేటీఆర్ ఇంటికి ఏసీబీ అధికారులు చేరుకోనున్నారు.


ఇవి కూడా చదవండి...

Allu Arjun: ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను చూడగానే అల్లు అర్జున్‌ రియాక్షన్ ఇదే..

KTR: కాంగ్రెస్ అంటేనే కన్నింగ్.. కేటీఆర్ విసుర్లు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 07 , 2025 | 03:44 PM