Share News

Casino .. హైదరాబాద్ శివారులో క్యాసినో గుట్ఠు రట్టు.. 64 మంది అరెస్టు..

ABN , Publish Date - Feb 12 , 2025 | 10:14 AM

హైదరాబాద్‌ శివారు మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో భారీగా క్యాసినో, కోడి పందాలు ఆడుతున్నవారిపై రాజేంద్రనగర్ పోలీసులు ఛేదించారు. కోళ్ల పందాలు నిర్వహిస్తున్న భూపతి రాజు శివకుమార్‌‌ను అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనలో 64 మందిని అరెస్టు చేశారు.

Casino .. హైదరాబాద్ శివారులో  క్యాసినో గుట్ఠు రట్టు.. 64 మంది అరెస్టు..
Hyderabad Casino Raid.

హైదరాబాద్: నగర శివారులో భారీ క్యాసినో (Casino)ను పోలీసులు (Police) పట్టుకోవడం కలకలం రేపింది. మొయినాబాద్‌లోని ఫామ్ హౌస్‌ (Farm House)పై దాడి చేసిన రాజేంద్రనగర్ పోలీసులు.. కోళ్ల పందాలతోపాటు క్యాసినో నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. ఈ ఘటనలో 64 మందిని అరెస్టు చేశారు. రూ. 30 లక్షల నగదుతోపాటు 55 కార్లు, 86 కోళ్లు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద మొత్తంలో బెట్టింగ్ కాయిన్స్ కూడా సీజ్ చేశారు. పట్టుబడినవారిలో ఏపీ, తెలంగాణకు చెందినవారు ఉన్నట్లు సమాచారం. నగరానికి చెందిన పలువురు ప్రముఖులు కలిసి క్యాసినో, కోడి పందాలు (Cockfighting) నిర్వహిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.

ఈ వార్త కూడా చదవండి..

జగన్‌ లిక్కర్‌ స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలి


హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉండే ఫామ్ హౌస్‌లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. ఇప్పటి వరకు డ్రగ్స్ పార్టీలు చూశాం. తాజాగా ఇప్పుడు సంక్రాంతి సంబరాల్లో ఏ విధంగా అయితే కోళ్ల పందాలు ఉభయ గోదావరి జిల్లాల్లో నిర్వహిస్తారో.. అదే తరహాలో నగర శివారు ప్రాంతం ఫామ్ హౌస్‌లో క్యాసినో, కోళ్ల పందాలు నిర్వహించారు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులతోపాటు రాజేంద్రనగర్ పోలీసులు సంయుక్తంగా మంగళవారం రాత్రి బృందాలుగా విడిపోయి దాడులు చేశారు. అక్కడున్నవారి అందరినీ అదుపులోకి తీసుకున్నారు. లోపల ఉన్నవారు బయటకు వెళ్లకుండా పోలీసులు ఫామ్ హౌస్‌ను చుట్టుముట్టారు. రూ. 30 లక్షల నగదు, 55 లగ్జరీ కార్లు సీజ్ చేశారు.ఈ కోడి పందెం కోసం తీసుకొచ్చిన 86 పందెం కోళ్ళు.. పెద్ద మొత్తంలో బెట్టింగ్ కాయిన్స్, పందెం కోళ్ల కోసం వాడే 46 కోడి కత్తులు కూడా స్వాధీనం చేసుకున్నారు.


ఈ కార్యక్రమాన్ని నడుపుతున్న నిర్వాహకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిర్వహిస్తున్న నెట్‌వర్క్‌ను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జూదంలో పాల్గొన్న వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ములుగు మన్నెంలో జాతరల సందడి

శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆర్జిత సేవలు రద్దు

మేడారం మినీజాతర.. మొక్కులు చెల్లించకోనున్న భక్తులు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 12 , 2025 | 10:14 AM