Phone Tapping Case: ట్రంప్ సంతకంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ట్విస్ట్
ABN , Publish Date - Jan 27 , 2025 | 12:41 PM
Phone Tapping Case: అమెరికాలో వలసదారులు, క్రిమినల్ కేసులో నిందితులను ఆయా దేశాలకు అప్పగించాలని ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు రిమైండర్స్ లెటర్లను హైదరాబాద్ పోలీసులు పంపనున్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులకు కోర్ట్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే.

హైదరాబాద్, జనవరి 27: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (America President Trump) సంతకంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు తిరగనుంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో (Former SIB chief Prabhakar Rao) పాటు శ్రవణ్ రావులను అమెరికా ప్రభుత్వం డిపోర్ట్ చేయనుంది. అమెరికాలో వలసదారులు, క్రిమినల్ కేసులో నిందితులను ఆయా దేశాలకు అప్పగించాలని ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు రిమైండర్స్ లెటర్లను హైదరాబాద్ పోలీసులు పంపనున్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులకు కోర్ట్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే.
వీరిద్దరిని ఇండియాకు రప్పించేందుకు తాజా పరిస్థితిని అనుకూలంగా మార్చుకునేందుకు పోలీస్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వీరిపై బ్లూ, రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. పాస్‌పోర్టు రద్దు, రెండు దేశాల మధ్య నేరస్తుల ఒప్పందం సంబంధించిన లేఖలను పోలీసులు మరోసారి పంపనున్నారు. ఇప్పటికే ఇద్దరిపై ఎల్ఓసీలు జారీ చేయడంతో ఇండియాలో అడుగుపెట్టగానే హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. ఫోన్ టాపింగ్ కేసులో ఏ1గా ప్రభాకరరావు, ఏ6 గా శ్రవణ్ రావు ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధకిషన్ రావు, అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు , డీఎస్పీ ప్రణీత్ రావులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడికి బెయిల్..
కాగా.. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఒక కీలకమైన ఫైలుపై సంతకం చేశారు. అమెరికాలో తలదాచుకున్న ఇతర దేశాలకు చెందిన నేరస్తులు, క్రిమినల్ కేసులో నిందితులను ఆయా దేశాలను అప్పగించాలని ట్రాంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని ఆ ఫైల్‌పై సంతకం కూడా చేశారు. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇండియా వదిలి అమెరికాలో ఉన్న ఏ1 నిందితుడు ప్రభాకర్‌రావు, ఏ6 నిందితుడు శ్రవణ్‌రావులను ఇండియాకు అప్పగించేందుకు అమెరికా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు చాలా సార్లు అమెరికా ప్రభుత్వానికి లేఖలు రాశారు. వారిద్దరినీ తమకు అప్పగించాలని రెడ్ కార్నర్ నోటీసును కూడా జారీ చేశారు.
వారి పాస్‌పోర్టులను కూడా రద్దు చేయాలంటూ అమెరికా ప్రభుత్వానికి పలు మార్లు లేఖలు రాశారు హైదరాబాద్ పోలీసులు. ఈ క్రమంలో ట్రంప్ సంతకంతో వచ్చే వారం పదిరోజుల్లో ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు ఇండియా అప్పగిస్తే ఈ కేసులో కీలక అంశాలు బయటపడే అవకాశం ఉంది. ఇరు దేశాల మధ్య నేరస్తుల ఒప్పందం చట్టం ప్రకారం మరోసారి అమెరికా ప్రభుత్వానికి హైదరాబాద్ పోలీసులు లేఖ రాసే అవకాశం ఉంది. ప్రభాకర్ రావు, శ్రవణ్‌రావులకు నాంపల్లి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశాలపై పూర్తిస్థాయిలో అమెరికా ప్రభుత్వానికి హైదరాబాద్ పోలీసులు లేఖ రాసే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..
ట్రంప్ సంచలన నిర్ణయం.. ఈ దేశాలకు సహాయం బంద్
జగన్ కేసులపై సుప్రీం తాజా నిర్ణయం ఇదీ..
Read Latest Telangana News And Telugu News